Headlines

IND vs PAK: చేతులెత్తేసిన బ్యాటర్లు.. పాక్ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా

IND vs PAK: చేతులెత్తేసిన బ్యాటర్లు.. పాక్ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా


యూఏఈ వేదికగా శుక్రవారం (నవంబర్ 30) ప్రారంభమైన పురుషుల అండర్-19 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించింది. తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన ఈ హైవోల్టేజీ పోరులో పాకిస్థాన్ యువ జట్టు ఏక పక్ష విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో పాక్ చేతిలో పరాజయం పాలైంది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండూ వైఫల్యమే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. పాక్‌కు ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్, షాజెబ్ ఖాన్ అద్భుతమైన బ్యాటింగ్ తో శుభారంభం అందించారు. ఇద్దరు ఆటగాళ్లు తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఉస్మాన్ ఖాన్ 94 బంతుల్లో 60 పరుగులు చేయగా, షాజెబ్ ఖాన్ 147 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో మొత్తం 159 పరుగులు చేశాడు. మరోవైపు భారత్ తరఫున సమర్థ్ నాగరాజ్ గరిష్టంగా 3 వికెట్లు తీయగా, ఆయుష్ మ్హత్రే 2 వికెట్లు, యుధాజిత్ గుహా-కిరణ్ చోర్మలే తలో వికెట్ తీశారు.

282 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. జట్టు స్కోరు 28 పరుగులకే ఆయుష్ మ్హత్రే రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దీని తర్వాత కూడా ఇండియా వికెట్ల పతనం కొనసాగింది. ఫలితంగా కేవలం 134 పరుగులకే భారత జట్టులో సగం మంది బ్యాటర్లు పెవిలియన్ చేరారు. అయితే ఒంటరి పోరాటం చేసిన నిఖిల్ కుమార్ 77 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కానీ భారత్ ను గెలిపించలేకపోయాడు. ఫలితంగా టీమిండియా 47.1 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ ఇప్పుడు డిసెంబర్ 2న షార్జాలో జపాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 4న తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. దీని తర్వాత రెండు గ్రూపుల్లోని టాప్ 2 జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీ ఫైనల్స్‌లో విజేతలు డిసెంబర్ 8న టైటిల్ కోసం పోటీ పడనున్నారు.

తర్వాతి మ్యాచ్ జపాన్ తో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *