హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది.. హాయిగా చెంగుచెంగున ఎగురుతున్న ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై రోడ్డుపైన విగతజీవిగా పడిపోయింది.. ఈ క్రమంలో అంతా వానరం చనిపోయిందనుకున్నారు.. అక్కడున్న మిగిలిన వానరాలు.. కూడా ఆ వానరం చనిపోయిందనుకొని అక్కడి నుండి ఎత్తుకెళ్లేందుకు మూగ ప్రయత్నాలు చేశాయి.. అది గమనించిన ఓ వ్యక్తి ఆ వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయుష్షు నింపాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? ఆ కోతులు ఎలా కృతజ్ఞత తెలిపాయి తెలుసా..? అయితే.. ఈ స్టోరీ చదవండి..
ఈ విచిత్ర సంఘటన హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ సమీపంలో జరిగింది. ఓ వానరం విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై స్పృహ తప్పి పడిపోయింది.. ఆ వానరం చనిపోయిందని అక్కడున్న వారంతా భావించారు.. దానితో పాటు వచ్చిన మిగిలిన వానర సేనలు కూడా ఆ కోతి చనిపోయిందని భావించాయి.. చనిపోయిన కోతి కళేబరాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశాయి..
వీడియో చూడండి..
విద్యుత్ శాక్ కు గురైన కోతిని గమనించిన జాటోత్ వెంకన్న అనే స్థానిక ఫోటోగ్రాఫర్ దాన్ని కాపాడేందుకు సాహసమే చేశాడు.. ఆ కోతుల గుంపు పైకి కర్రతో వెళ్లి.. వాటిని చదరగొట్టి కొన ఊపిరితో ఉన్న కోతిని తన వెంట వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్లాడు.
వెటర్నరీ ఆసుపత్రిలో సిబ్బంది ఆ వానరానికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు పోశారు.. అక్కడి నుండి మళ్ళీ ఆ కోతిని తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలాడు.
వీడియో చూడండి..
అయితే, ఆ వానరం ప్రాణాలు కాపాడిన ప్రోటోగ్రాఫర్ వెంకన్నకు కృతజ్ఞత చెప్పడం కోసం నోరులేని ఆ మూగజీవులు అక్కడికి పదుల సంఖ్యలో చేరుకున్నాయి.. అతని ఇంటి వద్ద ఆ వానర సేనలు కృతజ్ఞత చాటేందుకు చేసిన ప్రయత్నాలు అక్కడున్న వారందరిని ఆశ్చర్యాన్ని గురిచేసాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..