
పొడవైన, సన్నని, పాలిష్ చేసిన గోర్లు చూడడానికి చాలా బాగుంటాయి. అయితే రోజూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన గోళ్లపై చెడు ప్రభావం చూపిస్తుంది. అవును నెయిల్ పాలిష్ వేసుకొని గోళ్లు ఆరోగ్యంగా ఉఉంటాయి. కనుక అందం కోసం నెయిల్ పాలిష్ వేసుకునే బదులుగా గోళ్లను సహజంగానే కనిపించేలా ఉంచుకోవడం ఎల్లప్పుడూ సరైన ఎంపిక.. ఎందుకంటే నెయిల్ పాలిష్ ని నిరంతరం గోళ్లుకు వేసుకోవడం హానికరం.
చాలా మంది మహిళలు తమ గోళ్లుకు నెయిల్ పాలిష్‌ని ఉపయోగిస్తారు. గోళ్లుపై అనేక పొరలలో నెయిల్ పాలిష్ వేసి ఆరబెట్టుకుంటారు. అయితే సెలూన్లలోని ఫ్యాషన్ నిపుణులు గోళ్లుకు జెల్ నెయిల్ పాలిష్ ఉపయోగిస్తారు. దీనిని ఆరబెట్టడానికి మీ చేతులను LED లేదా UV లైట్ కింద ఉంచుతారు. ఇక ప్యాషన్ నిపుణులు పౌడర్ డిప్ పాలిష్ ని వేస్తుంటే..దీనిని గోళ్లకు వేయడానికి ముందుగా గోళ్లకు జిగురు వంటి బాండింగ్ పాలిష్‌ను పూసి, ఆపై వాటిని యాక్రిలిక్ పౌడర్‌లో ముంచుతారు. తర్వాత నెయిల్ పాలిష్ గట్టిపడడానికి ద్రవాన్ని ఉపయోగిస్తారు.
ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచిదా? చెడ్డదా?
- గోళ్లకు గాలి పీల్చాల్సిన అవసరం లేదు. కనుక అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోళ్లకు ఆరోగ్యానికి హాని కలుగదు. అయితే ఎల్లప్పుడూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోర్ల ఆరోగ్యానికి కలుగుతుంది.
- తరచుగా నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన గోర్లు పసుపు రంగులోకి మారవచ్చు
- జెల్ నెయిల్ పాలిష్ ఆరబెట్టడానికి ఉపయోగించే దీపం UV కిరణాలను విడుదల చేస్తుంది. ఇది చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుంది .
- నెయిల్ పాలిష్ తొలగించడానికి కెమికల్ రిమూవర్లను ఉపయోగించడం వల్ల గోళ్లు ఎండిపోయి విరిగిపోతాయి. గోళ్లలో పగుళ్లు ఏర్పడటం వల్ల బ్యాక్టీరియా చేరే ప్రమాదం పెరుగుతుంది.
ఏ విధంగా గోర్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు అంటే
- గోళ్లపై నెలల తరబడి నెయిల్ పాలిష్‌ను ఉంచవద్దు.
- జెల్ లేదా పౌడర్ డిప్ పాలిష్‌ను సొంతంగా తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేయడం వల్ల గోళ్లు దెబ్బతింటాయి. మానిక్యూరిస్ట్ మాత్రమే ఈ తరహా నెయిల్ పాలిష్ ని తొలగించుకోవాలి.
- UV లైట్లకు బదులుగా LED లైట్లను ఉపయోగించే సెలూన్‌కి వెళ్లండి. ఈ లైట్లలో పాలిష్ త్వరగా ఆరిపోతుంది. దీంతో గోళ్లను తక్కువ సమయం పాటు ఈ లైట్ కింద ఉంచడం నెయిల్ పాలిష్ ఆరిపోతుంది.
- ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నెయిల్ పాలిష్ వేసుకోండి. తక్కువ రసాయనాలు ఉన్న నెయిల్ పాలిష్ ను మాత్రమే వాడండి.
- జెల్ నెయిల్ పాలిష్ ను వేసుకుంటే చేతులకు సన్‌స్క్రీన్ అప్లై చేయండి. ఇది చర్మ క్యాన్సర్, చేతులపై అకాల ముడతలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)