Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటో తెలుసా..? ఆయన ఫొటోతో షాక్ ఇచ్చిందిగా

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటో తెలుసా..? ఆయన ఫొటోతో షాక్ ఇచ్చిందిగా


బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యరాయ్  గురించి ఈ మధ్య వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడిపోతుందని చాలా రోజులుగా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. విడిపోవాలని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ ఇద్దరూ ఎక్కడ కలిసి కనిపించడం లేదు కూడా.. ఎక్కడికి వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ సపరేట్ గా.. ఐష్ తన కూతురితో సపరేట్ గా వస్తున్నారు. దాంతో విడిపోతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య కొత్త వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐశ్వర్యరాయ్ మొబైల్ వాల్‌పేపర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

ఇటీవల ఐశ్వర్యరాయ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగించుకుని మళ్లీ ఇండియాకు వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ఆమె కనిపించగానే మీడియా మిత్రులు తమ కెమెరాల్లో బంధించేందుకు ఎదగబడ్డారు. ఆ క్రమంలో ఐశ్వర్య చేతిలో మొబైల్‌లోని వాల్‌పేపర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

ఐశ్వర్య నడుస్తుంటే మొబైల్ స్క్రీన్ ఆన్ చేసింది. ఈ ఫోటోలో ఆరాధ్య ఒకరితో కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఫోటో ఆరాధ్య, తాత అమితాబ్ బచ్చన్ కలిసి ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఇది ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్‌తో ఆరాధ్య ఉన్న ఫోటో అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో  పెద్దెత్తున చర్చ జరుగుతోంది. ఆ ఫోటో ఎవరిదీ అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అభిషేక్‌కి ఐశ్వర్యరాయ్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆరాధ్య బచ్చన్ ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుంది. అయితే అభిషేక్ బచ్చన్ ఎక్కడా కనిపించలేదు.

ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే 6 నెలలకే విడాకులు ఇచ్చింది.. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *