డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. కాసేపటికే సముద్రంలో.. అసలేం జరిగిందంటే..?

డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. కాసేపటికే సముద్రంలో.. అసలేం జరిగిందంటే..?


డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. కాసేపటికే సముద్రంలో.. అసలేం జరిగిందంటే..?
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

కొంతమంది ఎప్పుడు ఏం చేస్తారో.. ఎలా ఉంటారో తెలియదు. అప్పుడే మంచిగా ఉంటారు.. కాసేపటికే ఎవరూ ఊహించని ఘటనలకు పాల్పడుతారు. ముంబైలో జరిగిన ఘటన ఇదే కోవలోకి వస్తుంది. తన తల్లికి ఫోన్ చేసి డిన్నర్ కు వస్తున్నాను అని చెప్పిన కొడుకు.. కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. డాక్టర్ ఓంకార్ కవిట్కే జెజె హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని.. డిన్నర్‌ ప్రిపేర్ చేయాలని చెప్పాడు. దీంతో ఆ తల్లి డిన్నర్ రెడీ చేసి.. కొడుకు కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంది. ఎంతసేపైనా కొడుకు రాకపోవడంతో ఆ తల్లికి భయాందోళన మొదలైంది. ఇంతలోనే ఓ సమాచారం వచ్చింది. తన కొడుకు సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలియడంతో ఆమె బోరున విలపించింది. ఇంటికి వస్తాడనుకున్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.

డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓంకార్ అటల్ సేతూ వంతెనపై తన కారును ఆపాడు. ఆ తర్వాత వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసి ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఇంతవరకు మృతదేహం లభ్యం కాలేదు. అయితే ఎందుకు చనిపోయాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ సమస్యలా..? లేక ప్రేమ, ఉద్యోగ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

32 ఏళ్ల ఓంకార్ 2017లో గ్రాంట్ మెడికల్ కాలేజీ అండ్ సర్ జంషెడ్జీ జీజీభాయ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2023లో యావత్మల్‌లోని శ్రీ వసంతరావు నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశాడు. తొలుత గోకుల్‌దాస్ తేజ్‌పాల్ హాస్పిటల్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా, మహారాష్ట్ర రోహాలోని సబ్‌డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జేజే ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాడు. అప్పటినుంచి అక్కడే పనిచేస్తున్నాడు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీజినల్ అనస్థీషియాలజీ, అకాడమీ ఆఫ్ రీజినల్ అనస్థీషియాలజీ, ఆల్ ఇండియా డిఫికల్ట్ ఎయిర్‌వే అసోసియేషన్, ఇండియన్ రిససిటేషన్ కౌన్సిల్ వంటి వాటిల్లో ఓంకార్ సభ్యుడిగా ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *