50 Rupees Coin: మార్కెట్లో రూ. 50 నాణెం వస్తుందా? కీలక ప్రకటన చేసిన కేంద్రం

50 Rupees Coin: మార్కెట్లో రూ. 50 నాణెం వస్తుందా? కీలక ప్రకటన చేసిన కేంద్రం


50 రూపాయల నాణెం గురించి పెద్ద వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా కొత్త 50 రూపాయల నాణెం మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని స్పష్టంగా పేర్కొంది. వాస్తవానికిప్రస్తుతం మార్కెట్లో 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం 50 రూపాయల నాణేలను విడుదల చేయాలనే డిమాండ్ ఉన్న పిటిషన్‌కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ విషయం తెలిపింది. ప్రస్తుతం, 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి. కానీ 50 రూపాయల నాణెం లేదు.

ఇది కూడా చదవండి: Jio Plan: జియోలో దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

2022లో రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్వహించిన సర్వేలో ప్రజలు రూ.10, రూ.20 నాణేల కంటే కరెన్సీ నోట్లను ఇష్టపడుతున్నారని తేలిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నాణేల బరువు, పెద్ద పరిమాణం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రస్తుతం 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టాలని నిర్ణయించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

నాణెం డిమాండ్‌ను బట్టే తయారు:

ఏదైనా విలువ కలిగిన నాణెంను ప్రవేశపెట్టే ముందు ప్రజలు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? రోజువారీ లావాదేవీలలో ఇది ఉపయోగకరంగా ఉంటుందా? మొదలైన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటి తయారీపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

పిటిషన్‌లో ఏముంది?

చాలా నోట్లు దృష్టి లోపం ఉన్నవారు గుర్తించగలిగే విధంగా రూపొందించబడ్డాయని, కానీ 50 రూపాయల నోటులో అలాంటి లక్షణం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే అంధులు కూడా సులభంగా గుర్తించగలిగేలా 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం!

రిజర్వ్ బ్యాంక్ MANI అనే మొబైల్ యాప్‌ను రూపొందించిందని, దీని సహాయంతో దృష్టి లోపం ఉన్నవారు నోట్ల విలువను గుర్తించవచ్చని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ యాప్‌తో వినియోగదారులు నోటుపై రాసిన మొత్తాన్ని వినవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: iPhone 16: ఆపిల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్‌ 16

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. కేవలం లక్ష పెట్టుబడితో రూ.1.5 కోట్ల రాబడి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *