IND vs ENG 3rd Test : శుభమన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ గురించి ఇంగ్లాండ్ టీమ్ కాస్త టెన్షన్ పడుతుంది. ఎందుకంటే మొదటి టెస్ట్‌లో ఇండియా ఓడిపోయినప్పటికీ ఆ మ్యాచ్‌లో కూడా భారత బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ బౌలర్లను బాగా ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ఉంది. మూడో టెస్ట్ జులై 10 నుంచి లార్డ్స్‌లో మొదలవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పిచ్ గురించి ఒక వింత డిమాండ్ పెట్టాడు. మూడో టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్ ఆడే అవకాశం ఉంది. అతను దాదాపు 4 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆర్చర్ చాలా కాలంగా మోచేయి, వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. రెండో టెస్ట్‌కు ముందు జట్టులోకి తీసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో అతను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మూడో టెస్ట్‌కు గస్ అట్కిన్సన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు.
గస్ అట్కిన్సన్ తొడ కండరాల గాయం కారణంగా మొదటి రెండు టెస్టుల్లో ఆడలేదు. అతని తిరిగి రాకతో ఇంగ్లాండ్ బౌలింగ్ మరింత బలపడుతుంది. ఇంగ్లాండ్ మొదటి రెండు టెస్టుల్లో ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడింది. కానీ మూడో మ్యాచ్‌లో చాలా మార్పులు ఉండొచ్చు. ఇంగ్లాండ్‌కు ఉన్న పెద్ద చింత వారి బౌలింగ్ గురించే. ఆర్చర్, అట్కిన్సన్ రాకతో బెన్ స్టోక్స్ అండ్ టీమ్‌కు కాస్త ఊరట లభిస్తుంది.
ఇంగ్లాండ్ హెడ్ కోచ్ మెకల్లమ్ మాట్లాడుతూ.. లార్డ్స్ పిచ్‌పై బంతికి మరింత పేస్, బౌన్స్, స్వింగ్ ఉండాలని ఎంసీసీ చీఫ్ గ్రౌండ్స్‌మ్యాన్ కార్ల్ మెక్డర్మాట్ను కోరాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉదాహరణగా చూపిస్తూ అక్కడ రబాడా, కమిన్స్ లాంటి బౌలర్లు బంతిని బాగా స్వింగ్ చేయగలిగారని చెప్పాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన మెకల్లమ్.. “ఈ మ్యాచ్ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది. పిచ్‌పై పేసర్లకు సాయం లభిస్తే, మంచి బౌన్స్ ఉంటే ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ అవుతుంది” అని అన్నాడు. అంతకుముందు, రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ తమ బజ్ బాల్ క్రికెట్‌కు అనుకూలంగా ఉండే ఫ్లాట్ పిచ్‌లను కోరింది. మొదటి టెస్ట్‌ను ఇంగ్లాండ్ 5 వికెట్లతో గెలిచింది. అయితే రెండో టెస్ట్‌లో 336 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
జులై 10 నుంచి మూడో టెస్ట్
శుభమన్ గిల్ కెప్టెన్సీలో భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు వారి దృష్టి సిరీస్‌ను గెలిచి 18 ఏళ్ల కరువును తీర్చడం మీద ఉంది. భారత్ చివరిసారిగా 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్ తర్వాత మొత్తం 4 సిరీస్‌లు ఇంగ్లాండ్‌లో ఆడిన భారత్, వాటిలో 3 ఓడిపోయింది..ఒకటి డ్రా అయింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..