‘యానిమల్’ మూవీలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ హరిహరవీరమల్లు చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి, షూటింగ్ మొదలైన తొలి రోజుల్లోనే బాబీ రోల్కి సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేశారు. కాగా, యానిమల్ మూవీ తర్వాత.. బాబీ రోల్ విషయంలో దర్శకుడు జ్యోతి కృష్ణ మనసు మార్చుకుని మరో బ్రహ్మాండమైన రోల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు బాబీ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారనే టాక్ నడుస్తోంది.ఇదే విషయాన్ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. యానిమల్ చిత్రం చూసిన తర్వాత… బాబీ డియోల్ పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇచ్చామన్నాడు. అంతేకాదు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పాత్రలో బాబీ చూపే భావోద్వేగాలు బలంగా ఉండేలా చూశారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.
మరిన్నివీడియోల కోసం :