Amazfit: ఆకర్షిస్తున్న నయా ఫిట్‌నెస్ బ్యాండ్‌.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్

Amazfit: ఆకర్షిస్తున్న నయా ఫిట్‌నెస్ బ్యాండ్‌.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్


Amazfit: ఆకర్షిస్తున్న నయా ఫిట్‌నెస్ బ్యాండ్‌.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

డిస్‌ప్లే లేని ఫిట్‌నెస్ బ్యాండ్‌లు అనే పదం వినడానికి కొత్తగా ఉన్న విదేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే వీటిని లాంచ్ చేస్తున్నాయి. హూప్ వంటి బ్రాండ్‌లు అంతర్జాతీయంగా వీటిని రిలీజ్ చేయడంలో అగ్రస్థానంలో ఉంటాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు ఈ తరహా బ్యాండ్‌లను ధరిస్తున్నారు. తాజాగా అమేజ్‌ఫిట్ హీలియో స్ట్రాప్‌తో ఈ ప్రత్యేకమైన రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇది డిస్‌ప్లే లేకుండా ధరించగలిగే మొట్టమొదటిది ఫిట్‌నెస్ బ్యాండ్. నిద్ర, ఇతర కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడడానికి వీలుగా దీనిని రూపొందించారు. 

గత 12 నెలలు ఫిట్‌నెస్ ట్రాకింగ్ విషయంలో అందరూ స్మార్ట్ రింగ్‌లను ధరిస్తున్నారు. అయితే వీటితో పోలిస్తే డిస్ప్లే లేని బ్యాండ్‌లు ఎక్కువ స్టాండ్‌బై సమయాన్ని అందిస్తాయి. కొత్తగా రిలీజ్ చేసిన హీలియో స్ట్రాప్ ధర 99.99 డాలర్లు అంటే సుమారు రూ. 8,550. కాబట్టి ఇది ప్రీమియం కేటగిరీ ఫిట్‌నెస్ బ్యాండ్. అయితే హూప్ బ్యాండ్‌తో పోలిస్తే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్ట్రాప్ ఫైబర్-రీన్ఫోర్స్‌డ్ పాలిమర్ బాడీతో తయారు చేశారు. ఈ బ్యాండ్ కేవలం 20 గ్రాముల బరువు ఉంటుంది. అంటే మీరు దీన్ని ఎక్కువ గంటలు ధరించవచ్చు. ఈ బ్యాండ్ 5 ఏటీఎం నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది 50 మీటర్ల వరకు తట్టుకుంటుంది. ఈ స్ట్రాప్ ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టడానికి ఇతర ఇంటెన్సివ్ సెన్సార్లతో పని చేస్తుంది. ఈ స్ట్రాప్‌లో 232 ఎంఏహెచ్ బ్యాటరీతో రావడం వల్ల సాధారణ 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 

అమేజ్ ఫిట్ ఫిట్‌నెస్ బ్యాండ్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని ఉపయోగించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ఫీచర్లను అన్‌లాక్ చేయడానికి మీరు దీన్ని అమేజ్ ఫిట్‌కు సంబంధించిన జెప్ యాప్‌తో జత చేయాల్సి ఉంటుంది. ఈ ఫిట్‌నెస్ స్ట్రిప్ ద్వారా హార్ట్ బీట్, ఎస్‌పీఓ2 కోసం బయోట్రాకర్ పీపీజీ వంటి సెన్సార్‌లతో వస్తుంది. రన్నింగ్, సైక్లింగ్, పైలేట్స్, యోగా చేయడాన్ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు. ఈ స్ట్రిప్‌ను గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్, స్ట్రావా వంటి యాప్‌లతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 

మరిన్నిటెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *