Tollywood: చెత్తగా నటించావ్.. వెళ్లి మానిటర్ చూసుకోపో.. డైరెక్టర్ తిట్టడంతో వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్..

Tollywood: చెత్తగా నటించావ్.. వెళ్లి మానిటర్ చూసుకోపో.. డైరెక్టర్ తిట్టడంతో వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్..


సినిమా ప్రపంచంలో నటీనటులుగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ కెరీర్ ప్రారంభంలోనే అనేక విమర్శలు ఎదుర్కొని.. కష్టాలను, అడ్డంకులను దాటుకుని తమకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న తారలు ఎప్పుడో ఒకసారి.. ఏదోక సందర్భంలో విమర్శలు తీసుకున్నవారే. అందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. కెరీర్ తొలినాళ్లల్లో ఒక దర్శకుడు తనను అందరి ముందు తిట్టడంతో ఏడ్చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన ఉప్పు కప్పురంబు సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇందులో సుహాస్ కీలకపాత్రలో నటించారు. జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. “గీతాంజలి సినిమాతో మలయాళంలో నా సినీప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు ఇంకా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా.. ? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టారు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరిని అలాగే అనేస్తాడు. ఆయన కూతురు కళ్యాణి ప్రియదర్శన్ ను సైతం అలాగే తిట్టేవారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఉప్పు కప్పురంబు సినిమా దర్శకుడు శశి .. నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తారు. ఆయన ఆవేశంతో తిట్టేవరుక పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్ లో బాగా నటిస్తాను. ఈ డైరెక్టర్ సైతం మంచి నటుడు. ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపిస్తాడు. గీతాంజలి సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్.. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *