అమ్మానాన్నలిద్దరూ దిగ్గజ నటీనటులు కావడంతో ఈ అమ్మడు కూడా వారి బాటలోనే నడిచింది. హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ కథానాయికగా నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ అమ్మడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిళ్ల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఈ భామ ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముగ్గురికి సైతం విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈ అందాల తార నాలుగో పెళ్లి కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆమె పెళ్లి కూతురిగా ముస్తాబవ్వడం, వరుడు నటి మెడలో తాళి కట్టడం, ఇద్దరూ కలిసి ఏడడుగులు నడవడం, ఇదే సందర్భంలో హీరోయిన్ కాస్త ఎమోషనల్ అవ్వడం ఇందులో చూడొచ్చు. చాలా మంది మొదట ఈ వీడియోను చూసి టాలీవుడ్ నటి నాలుగో పెళ్లి చేసుకుందని విషెస్, కామెంట్స్ పెట్టారు. అయితే వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ లో ఇది అసలు పెళ్లి కాదని తెలిసింది.
ఇవి కూడా చదవండి
కోలీవుడ్ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దేవి సినిమాతో హీరోయిన్ గా మెప్పించిన ఈ అందాల తార ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ ఎవరితోనూ కలిసుండలేక ముగ్గురికి విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటోన్న ఆమె ‘మిసెస్ & మిస్టర్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాబర్ట్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా వనితనే దర్శకత్వం వహిస్తుండగా.. నటి కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరిస్తుండడం మరో విశేషం. సినిమా ప్ డేట్ లో భాగంగా శుభ ముహూర్తం అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే వీరు రీల్ మ్యారేజ్ చేసుకున్నారు.
నెట్టింట వైరలవుతోన్న వనితా విజయ్ కుమార్ వెడ్డింగ్ వీడియో ఇదే..
రజనీకాంత్ తో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి