Andhra News: నవ వధువుపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నం.. సమయానికి భర్త రాకతో సీన్‌ రివర్స్‌!

Andhra News: నవ వధువుపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నం.. సమయానికి భర్త రాకతో సీన్‌ రివర్స్‌!


ఇటీవల కాలంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఆడ, మడ తేడా లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మహిళలు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తలను హత్య చేస్తుంటే.. కొందరు కామాందులు మాత్రం.. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. వారిపై పడి బలవంతంగా తమ కామకొరికలను తీర్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే పడ్నాడు జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లై కాళ్లకు పారాని కూడా ఆరకముందే ఓ నవవధువుపై ముగ్గురు కామాందులు ఆత్యాచారానికి యత్నించారు.

వివరాళ్లోకి వెలితే.. బాధితురాలు అయిన మహిళకు ఇటీవలే వివాహం జరిగింది. అయితే భర్తతో పాటు ఇంట్లో వాళ్లు పనికి వెళ్లడంతో బాధిత మహిళ ఒక్కతే ఇంట్లో ఉంది. ఆది గమనించిన ముగ్గురు వ్యక్తులు తమ వక్రబుద్దికి పనిచెప్పారు. బాధిత మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడి.. ఆమెను బంధించారు. తర్వాత ఒకరు వీడియో తీస్తుండగా మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడే ఆమె భర్త ఇంటికి రావడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది.

బాధిత మహిళ భర్త ఇంటికి రావడాన్ని గమనించిన ముగ్గురు నిందితులు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో స్థానికులు కూడా ఈ దాడిని గమనించడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక పోయిన బాధితురాలు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం సదురు మహిళ హాస్పిట్‌లో చికిత్స పొందుతుంది.

ఇక బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *