సింగర్ చిత్ర.. ఈ పేరు తెలియనివారుండరు. దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రపంచంలో వేలాది పాటలతో తనదైన ముద్రవేశారు. ఎన్నో పాటలకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిత్ర. ఆమెను అభిమానించేవారు తప్ప విమర్శించేవారు చాలా తక్కువ. చక్కని చిరునవ్వు.. అద్భుమైన గాత్రంతో అడియన్స్ హృదయాలను దోచుకున్నారు సింగర్ చిత్ర. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిత్రకు ఇటీవల ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఆమె చేతికి కట్టుతో కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. తాజాగా స్టార్ సింగర్ సీజన్ 10లో జడ్జీగా పాల్గొన్న చిత్రకు తనకు జరిగిన ప్రమాదం పై స్పందించారు.
తనకు చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపింది.”హైదరాబాద్ వెళ్లడానికి చెన్నై విమానాశ్రయంలో నిలబడి ఉన్నాను. భద్రతా తనిఖీ తర్వాత మా హస్బెండ్ కోసం ఎదురుచూస్తున్నాను. దీంతో అక్కడికి చాలా మంది ఫోటోస్ తీయడానికి వచ్చారు. ఆ సమయంలో ఎవరో నాతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహంతో నా కాలు వెనుక టేబులు మీద ఉంచాల్సిన ట్రేని వదిలి వెళ్లారు. నేను దానిని చూడలేదు. ఫోటో తీసిన తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. నేను వెనక్కు నడవడానికి కాలు పెట్టాను. దీంతో నా కాలు ట్రేకి తగిలి బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దీంతో నా భుజం దగ్గరి ఎముక పక్కకు జరిగింది. దాదాపు అంగుళంన్నర కిందకు ఎముక జరిగింది. వెంటనే నన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్స్ ఎముకను సరిచేశారు. కానీ మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే మరో మూడు నెలలు నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు” అంటూ చిత్ర చెప్పుకొచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో చిత్ర త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చిత్ర దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో కొనసాగుతున్నారు. తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషలలో అనేక పాటలు పాడారు. ఇప్పటివరకు 25 వేలకు పైగా పాటలు పాడినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..
Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్.. ఇప్పుడేం చేస్తుందంటే..
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..