OTT Movie: డాక్టర్ అవ్వాల్సిన కుర్రాడిని ప్రేతాత్మ ఆవహిస్తే.. ఓటీటీలో భయపెడుతోన్న రియల్ హారర్‌ స్టోరీ

OTT Movie: డాక్టర్ అవ్వాల్సిన కుర్రాడిని ప్రేతాత్మ ఆవహిస్తే.. ఓటీటీలో భయపెడుతోన్న రియల్ హారర్‌ స్టోరీ


ఓటీటీలో ఇప్పుడు సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. ఈ జానర్ సినిమాలు ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. థియేటర్లలో ఆకట్టుకోని సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో కొద్ది మందికి మాత్రమే ఈ హారర్ మూవీ రీచ్ అయ్యింది. అయితే ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కౌశిక్ అనే కుర్రాడు ఎంబీబీఎస్ చదువుతుంటాడు. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాటను కాదనలేక డాక్టర్ కోర్సు చేస్తుంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కోసమే తనకు ఇష్టం లేకపోయినా కాలేజీకి వెళుతుంటాడు. కౌశిక్ ఎక్కువగా ఒంటరిగా గడుపుతుంటాడు. ఇదే సమయంలో అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుంది. అది క్రమంగా ప్రమాదకరంగా మారుతుంది. కౌశిక్ ప్రవర్తనను చూసి తల్లిదండ్రులతో సహా అందరూ భయపడతారు. ఒకరోజు ఇంట్లో పంది మాంసం కావాలని అడుగుతాడు. అది తినేటప్పుడు కౌశిక్ ప్రవర్తన చూసి పేరెంట్స్ భీతిల్లిపోతారు. సైకియాట్రిస్టుకు చూపించినా అతనిలో మార్పురాదు.

చివరకు కౌశిక్ ను ఒక మంత్ర గాది దగ్గరకు తీసుకెళతారు. అతను కౌశిక్ ను ఒక ప్రేతాత్మ ఆవహించిందని చెబుతాడు. ఆ దుష్టశక్తే కౌశిక్ తో ఇలా చేయిస్తుందంటాడు. మరి ఆ ప్రేతాత్మ ఎవరు? కౌశిక్ నే ఎందుకు ఆవహించింది? చివరకు ఏం జరిగింది? కౌశిక్‌ ఆ ప్రేతాత్మ నుంచి బయటపడతాడా ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ

ఇవి కూడా చదవండి

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ఘటికాచలం. ఉయ్యాల జంపాలా, బాహుబలి తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నిఖిల్ దేవాదలు ఈ సినిమాలో హీరోగా నటించాడు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. సమ్యు రెడ్డి, ఆర్వికా గుప్తా, తన్మయి ఖుషి, అర్జున్ విహాన్, ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఘటికాచలం సినిమాలో నిఖిల్ దేవాదుల..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *