ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత, విచిత్రమైన వ్యాధులు, ఘటనలు జరిగినా దాని మూలాలు ఎక్కువగా డ్రాగన్ కంట్రీతోనే ముడి ఉంటాయి. సరిగ్గా అలాంటి వింత సంఘటనే చైనాలో వెలుగులోకి వచ్చింది. చైనాలోని అన్హుయ్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఒక 64 ఏళ్ల వ్యక్తి పొట్టల్లోంచి వైద్యులు ఇటీవల 17 సెంటీమీటర్ల పొడవైన టూత్‌బ్రష్‌ను తొలగించారు. గత 52 ఏళ్లుగా ఆ బ్రష్ అతడి కడుపులోనే ఉందని తెలిసి వైద్యులు షాక్ తిన్నారు. అంటే తన 12వ యేట అతడు ఆ బ్రష్‌ను మింగేశాడు. అది ఇప్పుడు బయటకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
చైనాలోని అన్హుయ్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తి తన చిన్నతనంలో అనుకోకుండా మింగిన పిల్లల టూత్ బ్రష్ 52 సంవత్సరాలుగా తన శరీరంలోనే ఉండిపోయింది. ఈ వార్త సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాంగ్ అనే ఇంటిపేరున్న ఆ వ్యక్తి ఇటీవల విపరీతమైన ఛాతీ నొప్పితో అవస్థపడ్డాడు. నోప్పిని భరించలేక అతడు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతనికి సాధారణ ఎండోస్కోపీ, ఇమేజింగ్ స్కాన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే అతని డ్యూడెనమ్, చిన్న ప్రేగు మొదటి విభాగం లో పొడవైన, సన్నని ప్లాస్టిక్ వస్తువును చూసి డాక్టర్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వెంటనే బాధిత వ్యక్తికి మరిన్ని టెస్టులు నిర్వహించగా, అతని పొట్టలో ప్లాస్టిక్ టూత్ బ్రష్ అని నిర్ధాణ అయింది. 12 ఏళ్ల వయసులో యాంగ్ ఆడుకుంటూ అనుకోకుండా ఆ బ్రష్ మింగినట్లు చెప్పాడు. తన తల్లి తిడుతుందనే భయంతో అప్పట్లో అతను ఎవరికీ చెప్పలేదట. అది తన శరీరం లోపలే కరిగిపోతుందిలే అని భావించాడట. కానీ, ఇంతకాలానికి అది బయటకు వచ్చింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..