Viral: లేటు వయసులో ఘాటు ప్రేమతో నటిని పెళ్లాడి చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే

Viral: లేటు వయసులో ఘాటు ప్రేమతో నటిని పెళ్లాడి చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే


ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. లేటు వయసులో ఘాటు ప్రేమతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఓ నటితో రెండో వివాహం.. రీల్స్‌ కారణంగా ఆయనపై పార్టీ సీరియస్ అయింది. సహరన్‌పూర్ నటి ఊర్మిళ సనావర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌. భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారు సురేష్ రాథోడ్. ఇష్టారీతిన రీల్స్‌ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. సనావర్‌కు మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సురేష్ రాథోడ్ జంటతో పాటు పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సురేష్ రాథోడ్‌కు పార్టీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యంపై 7 రోజుల్లో స్పందించాలని ఆదేశించింది.

ఉత్తరాఖండ్‌లో అమలులో ఉన్న యూనిఫాం సివిల్ కోడ్ ప్రకారం.. బహుభార్యత్వం చెల్లదు. కానీ తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటిని పెళ్లిచేసుకోవడం వివాదాస్పంగా మారింది. విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో.. పార్టీ స్పందించింది. అయితే నటి సనావర్‌ను 2021లోనే నేపాల్‌లో పెళ్లిచేసుకున్నట్టు సురేష్ రాథోడ్ చెప్తున్నారు. అప్పటికి యూనిఫాం సివిల్ కోడ్ అమలులో లేదంటున్నారాయన.

2017 నుంచి 2022 వరకు హరిద్వార్‌లోని జ్వాలాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యేగా సురేష్ రాథోడ్ కొనసాగారు. 2022 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నటితో సహజీవనం చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం.. మీడియా ముందు ప్రపోజ్ చేసుకోవడంతో చిక్కుల్లో పడ్డారు సురేష్ రాథోడ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *