Tollywood: ‘గుడ్ బై.. ఇకపై మీకు కనిపించను’.. టాలీవుడ్ నటుడి సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?

Tollywood: ‘గుడ్ బై.. ఇకపై మీకు కనిపించను’.. టాలీవుడ్ నటుడి సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?


Tollywood: ‘గుడ్ బై.. ఇకపై మీకు కనిపించను’.. టాలీవుడ్ నటుడి సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

 

సినిమాల్లోకి రాక ముందు ఈ నటుడు ఒక ప్రముఖ వైద్యుడు. అయితే సినిమాలపై మక్కువతో వైద్య వృత్తిని విడిచి పెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట డైరెక్ట ర్ గా అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ క్లిక్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత నటునిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కమెడియన్ గా.. ఇలా ఇప్పటివరకు సుమారు 30 కు పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించాడు. మంచి నటుడున్న గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో తన నోటి దురుసుతో తరచూ వివాదాల్లో ఇరుక్కున్నాడు. సినిమా ఈ వెంట్లు, ఫంక్షన్లలో కొన్ని సార్లు ఈ నటుడు చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అలాగే సోషల్ మీడియాలోనూ కాంట్రవర్సీ పోస్టులు షేర్ చేస్తూ నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురయ్యాడు. ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్ లో తమ సినిమాకు నెగిటివ్ ఇచ్చారని రివ్యూ రైటర్లపై బండ బూతులతో విరుచుకు పడ్డాడీ నటుడు. ఆ తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో కాస్త దిగి వచ్చి క్షమాపణలు కూడా తెలియజేశారు. అలా ఎప్పుడూ కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలిచే ఆ నటుడు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇప్పుడది వైరల్ గా మారింది. ఇంతకీ ఆ నటుడెవరో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన పేరు శ్రీకాంత్ అయ్యంగర్.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీకాంత్ అయ్యంగార్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు. అలా తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ‘‘నమస్తే అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఒక సూపర్, ఎక్స్ ట్రార్డినరి, మైండ్ బ్లోయింగ్ న్యూస్‌‌తో మీ ముందుకు వచ్చాను. మరో నాలుగు నెలలు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించను. వ్యక్తిగత కారణాల వల్లే ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నాను. అందరికీ గుడ్ బాయ్’ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు ఇన్ స్టా గ్రామ్ లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న శ్రీకాంత్‌కు సడెన్‌గా ఏమైంది? ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

శ్రీకాంత్ అయ్యంగర్ వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Shrikanth Krishnaswamy (@shrikanth_bharat)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *