బజాజ్ ఆటో భారతదేశంలో చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,990 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ ఈ-స్కూటర్ చేతక్ 35 సిరీస్‌పై నిర్మించారు.
చేతక్ 3001 సింగిల్ ఛార్జ్‌లో 127 కి.మీ రైడింగ్ రేంజ్, 35-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్-మౌంటెడ్ 3.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 750 వాట్స్ ఛార్జర్ ప్రామాణికంగా వస్తుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు నాలుగు గంటలు పడుతుంది.
స్కూటర్ కాల్, మ్యూజిక్ కంట్రోల్స్, హిల్ హోల్డ్, రివర్స్ లైట్, గైడ్-మీ-హోమ్ ల్యాంప్స్ ఉన్న అదే ఇన్స్ట్రుమెంటేషన్ను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది
చేతక్ 3001 బుకింగ్‌లు అన్ని షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి. అలాగే ఈ నెలాఖరు నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఈ -స్కూటర్‌ను ఎరుపు, నీలం, పసుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.