సాధారణంగా కోతుల బెడద ఎక్కువగా ఉన్న చోట ఇలాంటి కొండెంగలను తెచ్చి పెడతారు.. కానీ ఇక్కడ మాత్రం దిన్ని ఎవరు తెచ్చిపెట్టుకున్న,దాని అంతటా అదే ఇక్కడ ఉంటుంది..ఈ కొండెంగ ను కూడా అందరు బాగా చూసుకుంటున్నారు..ఎవరికి ఏ హాని చేయకుండా పండ్లు బిస్కెట్లు తింటూ ఇక్కడే సంచరిస్తుందని తెలుపుతున్నరూ స్థానికులు.. అయితే ఇక్కడ కోతుల బెడద విపరీతంగా ఉందని ఈ కొండెంగను చూస్తే కోతులు రావడంలేదని, ఇంకా ఇలాంటి కొండెంగలు కూడా నర్సాపూర్ వస్తే బాగుంటుందని, అధికారులు కూడా నాలుగైదు కొండెంగలు నర్సాపూర్ తీసుకురావాలని కోరుకుంటున్నారు స్థానిక వర్తకులు…ఎవరికి హాని చెయ్యకపోవడం ఇచ్చింది మాత్రమే తినడం, జనావాసాల్లోనే సంచరించడం ఈ కొండెంగ నైజం.
ఈ కొండెంగ వల్ల ఉపయోగం కూడా ఉందని, తరచూ కోతులు పిల్లలు, పెద్దలపై దాడులు చేస్తూ, తమ షాపులలో ఇండ్లల్లో నుండి తినే వస్తువులు ఎతికెళుతూ ఇబ్బంది పెడుతుంటే ఈ కొండెంగ మాత్రం ఇచ్చింది తిని సంతోష పెడుతుందని, కొండెంగను చూసిన కోతులు తమ షాపుల వద్దకు రావడానికి భయపడి దూరంగా పరిగెడుతున్నాయని తెలియజేస్తున్నారు నర్సాపూర్ వాసులు…
ఒకరోజు బస్టాండ్ ప్రాంతంలో మరొక రోజు చౌరస్తా ప్రాంతంలో ఇలా నర్సాపూర్ మున్సిపాలిటీలోని హైదరాబాద్ రహదారి వద్ద గల షాపుల సముదాయం నుండి మెదక్ వైపుగా తిరుగుతుందని షాపులో వద్దకు వచ్చి కూర్చొని ఇచ్చింది మాత్రమే తింటుందని ఎవరికి ఏ హాని చెయ్యకుండా ఆరు మాసాలుగా ఇక్కడే తిరుగుతుందని అంటున్నారు స్థానికులు.ఇక రాత్రి సమయాల్లో మున్సిపాలిటీలో నీ ఏదో ఒకచోట నిదిరిస్తుందట.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..