Tollywood: మాజీ ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. 4 నెలలకే బ్రేకప్.. ఇప్పుడు సినిమాలకు దూరం..

Tollywood: మాజీ ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. 4 నెలలకే బ్రేకప్.. ఇప్పుడు సినిమాలకు దూరం..


హీరోయిన్స్ గురించి నిత్యం ఏదోక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముద్దుగుమ్మ గురించి సైతం అనేక వార్తలు హల్చల్ చేశాయి. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. ఆమె ప్రేమ, వివాహానికి సంబంధించిన వార్తలు తెగ వినిపించాయి. ఆమె పేరు ప్రతిరోజూ వారి పేరు ఎవరో ఒకరితో ముడిపడి ఉండేది. సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యింది. తెలుగులో తొలి సినిమాతో అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు. ఆడాపాదడపా పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫాలోయింగ్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి మనవడితో పెళ్లికి రెడీ అయ్యి నిశ్చితార్థం సైతం చేసుకుంది. కానీ నాలుగు నెలలకే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత ఈ వయ్యారి సినిమాలకు సైతం దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే మెహ్రీన్ ఫిర్జాదా.

పంజాబ్‌లో పెరిగిన నటి మెహ్రీన్ పిర్జాదా మోడలింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి అనేక ప్రకటన చిత్రాలలో నటించింది. నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. మెహ్రీన్ ని చూసిన తర్వాత, ఇండస్ట్రీ మరో కాజల్ అగర్వాల్ వచ్చిందనే టాక్ వినిపించింది. తెలుగులో శర్వానంద్, వరుణ్ తేజ్, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగ శౌర్య వంటి హీరోస్ అందరి సరసన నటించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. హర్యానా రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నరాు. కానీ నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలల తర్వాత వీరిద్దరు విడిపోయారు. మెహ్రీన్ చివరిసారిగా ఎఫ్ 3 సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *