Headlines

November Exam Dates: నవంబర్‌లో జరిగే ముఖ్యమైన రాత పరీక్షలు ఇవే.. ఏయే తేదీల్లో ఏ పరీక్ష ఉంటుందంటే

November Exam Dates: నవంబర్‌లో జరిగే ముఖ్యమైన రాత పరీక్షలు ఇవే.. ఏయే తేదీల్లో ఏ పరీక్ష ఉంటుందంటే


అక్టోబర్‌ నెల ముగిసిపోయి కొత్త నెలలో అడుగుపెట్టాం. ఇటీవల దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటికీ అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు కూడా. వాటిల్లో కొన్నింటికీ రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. నవంబర్‌ నెలలో జరగనున్న పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి పరీక్షలు, వాటి తేదీల వివరాలు ఈ కింద పొందుపరిచాం. ఆ వివరాలు ఏమిటో మీరూ తెలుసుకోండి..

నవంబర్‌లో జరగనున్న పరీక్షల తేదీలు, వాటి వివరాలు ఇవే..

  • టీజీపీఎస్సీ గ్రూప్‌-3 పరీక్ష నవంబర్‌ 17, 18 తేదీల్లో జరుగుతుంది.
  • తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష నవంబర్‌ 23వ తేదీన జరుగుతుంది.
  • ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో ఫైలెట్ పరీక్ష నవంబర్‌ 25 నుంచి 29 వరకు ఆయా తేదీల్లో జరుగుతుంది.
  • ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌ 9వ తేదీన జరుగుతుంది.
  • క్యాట్-2024 పరీక్ష నవంబర్‌ 24వ తేదీన జరుగుతుంది.

ఏపీఆర్‌సెట్‌ 2024 తుది విడత కౌన్సెలింగ్‌ షురూ.. సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఆర్‌సెట్ 2024’ రెండో, తుది విడత కౌన్సెలింగ్‌ నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీఆర్‌సెట్‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబర్‌ 4 వరకు వెబ్‌కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్‌ 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినవారు నవంబర్‌ 7 నుంచి 9 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. నవంబర్‌ 10న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇస్తారు. ఇక నవంబర్‌ 12న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్‌ 13 నుంచి 16తేదీల్లోపు ఆయా కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *