ప్రస్తుత కాలంలో పలు దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఎటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ వచ్చేముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముందుగానే వాటిని పసిగడితే క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే అంతం చేయవచ్చు.
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివర్ క్యాన్సర్తో మరణిస్తున్న విషయం తెలిసిందే. కానీ లివర్కి క్యాన్సర్ ఎటాక్ అయ్యే ముందు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కనిపించే ప్రారంభ లక్షణాల్లో కడుపులో నొప్పి కూడా ఒకటి. కుడి వైపు ఎక్కువగా ఎప్పుడూ లేనంతగా అసౌకర్యంగా ఉంటూ నొప్పిగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి.
లివర్ క్యాన్సర్ వచ్చే ముందు కామెర్లు కూడా వస్తాయి. కళ్లు, చర్మం, గోర్ల రంగు పసుపు పచ్చ రంగులోకి వస్తుంది. కాబట్టి కామెర్లు వచ్చినా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టెస్ట్ చేసుకోండి.
అదే విధంగా అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లివర్ క్యాన్సర్కు కారణం కావచ్చు. అలసటగా వాంతులు, వికారంగా ఉన్నా కూడా ఇదే సమస్య అయి ఉండొచ్చు. అలాగే మీ మూత్రం ముదురు రంగులో వస్తున్నా కూడా లేట్ చేయకుండా టెస్టులు చేయించండి.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )