మరీ ఇంత దారుణమా!.. విదేశీ యువతిపై తల్లి, కొడుకుల పైశాచికత్వం.. గదిలో బంధించి వీడియోలు తీసి మరీ…

మరీ ఇంత దారుణమా!.. విదేశీ యువతిపై తల్లి, కొడుకుల పైశాచికత్వం.. గదిలో బంధించి వీడియోలు తీసి మరీ…


కొడుకు తప్పుదోవ పడితే.. మందలంచాల్సిన తల్లే దారితప్పింది. తల్లి చేస్తున్న తప్పుడు పనులను అడ్డుకోవాల్సిన కొడుకు.. తల్లికి సహకరించాడు. ఇంకేంముంది ఇద్దరు కలిసి అడ్డదారులు తొక్కారు. తల్లీ కొడుకు కలిసి సభ్యసమాజం చీత్కరించుకునే దందాకు తెరలేపారు. వెస్ట్‌ బెంగాళ్‌ హౌరాలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అందాలు ఒలకబోస్తున్న ఈవిడ శ్వేతా ఖాన్‌! వయసు 40 కిపైమాటే! వయసుకు తగ్గట్టే ఈమె పెద్ద దేశముదురే. బార్‌ డ్యాన్సర్‌గా పనిచేసింది. భర్తను వదిలేసి కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ తో కలిసి హౌరా జిల్లా లోని దోమ్‌జూర్‌లో ఉంటోంది. తల్లీ కొడుకు కలిసి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ నడుపుతున్నారు. పేరుకే ఈవెంట్‌ మనేజ్‌మెంట్‌ సంస్థ.. ఈ ముసుగులో చేస్తోంది మాత్రం గలీజ్‌ దందా. నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరుతో గాలం వేసి అస్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారు. యువతులను బంధించి వ్యభిచారం చేయించడం.. బార్‌ డ్యాన్సర్‌ వృత్తిలోకి దించండం వీరి పని.

బంగ్లాదేశ్‌కి చెందిన ఓ యువతిని ఫేస్‌ బుక్‌లో పరిచయం చేసుకున్న ఆర్యన్‌ ఖాన్‌. తన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో ఉద్యోగం ఉందని మాయమాటలు చెప్పాడు. నిజమేనని నమ్మిన యువతి హౌరాలోని ఆర్యన్‌ ఖాన్‌ ఇంటికి చేరుకుంది. తల్లి శ్వేతా ఖాన్‌.. ఆ యువతిని ఓ ఫ్లాట్‌లో ఉంచింది. యువతి మొబైల్‌ ఫోన్స్‌ లాక్కుని నిర్భందించింది. తల్లీ కొడుకు ఇద్దరు కలిసి ఆ యువతితో అస్లీల వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందుకు ఆ యువతి నిరాకరించడంతో.. యువతి పై దాడి చేశారు. చిత్రహింసలు పెట్టారు. నాలుగు రోజులకు ఓ పూట మాత్రమే ఆహారం అందించి నరకం చూపించారు. ఆ యువతితో అస్లీల వీడియోలు చిత్రీకరించడమే కాకుండా… బార్‌ బ్యాన్సర్‌గా పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు.

ఇలా ఆరు నెలల పాటు బంధించి.. వీడియోలు చిత్రీకరించారు. ఎట్టకేలకు ఆ తల్లీ కొడుకుల చెర నుంచి తప్పించుకుని యువతి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు చెప్పింది. పోలీసులు చేరుకునే లోపే తల్లీ కొడుకు ఇద్దరు పరార్‌ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ కీచక తల్లి కొడుకు కోసం గాలిస్తున్నారు. ఇలా ఎంతోమంది యువతులను బంధించి అస్లీల వీడియోలు చిత్రీకరించడం. వ్యభిచార కూపంలోకి నెట్టడం. బార్‌ డ్యాన్సర్లుగా మార్చినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *