నీల్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. త్వరలోనే ఆయన డార్లింగ్ సినిమా విషయంలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ ఏడాదే షూటింగ్ జరుగుతుందట.. అంటూ నిన్న మొన్నటిదాకా వైరల్ అయిన న్యూస్.. ఇప్పుడు నిజంగానే నిజమైంది.
డార్లింగ్ బర్త్ డే రోజు కొబ్బరికాయ కొట్టేశారు నీల్.. సలార్2 ఇప్పడు యమా స్పీడుగా జరుగుతోంది. ఇద్ధరు ప్రాణ స్నేహితుల కథను సలార్ సీజ్ ఫైర్ చూపిస్తే,
వారు బద్ధ శత్రువులుగా మారిన స్టోరీతో సెకండ్ పార్ట్ శౌర్యాంగపర్వం సిద్ధమవుతోంది. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొబ్బరికాయ కొట్టేశారు మేకర్స్. సలార్2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
ఇదే స్పీడు కంటిన్యూ అయితే 2025 ఎండింగ్‌కి శౌర్యాంగపర్వం రిలీజ్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది రెబల్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న న్యూస్. ఆ మధ్య కాస్త డల్‌గా సాగిన డార్లింగ్ కెరీర్లో ఊపు తెచ్చిన సినిమాగా సలార్ మీద స్పెషల్ ప్రేమ ఉంది రెబల్ ఆర్మీలో.
ఓ వైపు సలార్ సీక్వెల్ షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫౌజీ చేస్తున్నారు ప్రభాస్. హను రాఘవపూడి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ కి.
ఇటు కల్కి సీక్వెల్ న్యూ ఇయర్లో స్టార్ట్ అయ్యే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల షూటింగులు చేయాలంటే, డార్లింగ్ ఎన్ని షిఫ్టులు పనిచేయాలి? అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.
వీటన్నిటితో నాకేం సంబంధం లేదు.. నా టార్గెట్ నెక్స్ట్ సమ్మర్ అన్నట్టు రెడీ అవుతోంది రాజా సాబ్. హారర్ సరికొత్త హ్యూమర్ అంటూ సినిమాను కలర్‌ఫుల్‌గానే ప్రజెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు కెప్టెన్ మారుతి.