నిన్నటిదాకా జాన్ జిగ్రీ దోస్తులు. ఇలాంటి గాఢమైన స్నేహబంధం ఉన్నవారి మధ్య విభేదాలు వస్తే, అగ్నిపర్వతాలు బద్దలైనట్లుగా సీన్ మారుతుంది. అమెరికాలో ట్రంప్, మస్క్ మధ్య సరిగ్గా ఇదే జరిగింది. గతవారం DOGE నుంచి వైదొలగి, ట్రంప్‌కు మస్క్ బైబై చెప్పడం వెనకున్న కారణం బయటకొచ్చింది. డబ్బుల దగ్గర మొదలైన వివాదం, డర్టీపిక్చర్‌దాకా వెళ్లింది.
అయితే ఇటీవల నుంచి డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ట్రంప్‌ను అభిశంసించాలంటూ మస్క్ డిమాండ్ చేశారు. బిగ్ బాంబ్ వేయడానికి సమయం వచ్చిందంటూ Xలో మస్క్ పోస్ట్ పెట్టారు. చైల్డ్ సెక్స్ అఫెండర్ జెఫరీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ మస్క్ ఆరోపించారు. ఈ వివరాలను తొక్కిపెట్టారంటూ మస్క్ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ట్రంప్-ఎప్‌స్టీన్ వీడియో. నా మాటలు గుర్తుంచుకోండి.. నిజం బయటకు వస్తోందంటూ మస్క్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో చెప్పారు.
ఇది కూడా చదవండి: World’s Longest Road: ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు.. ఎలాంటి యూ-టర్న్ లేకుండా 14 దేశాల గుండా..
ఇంతకీ అసలు ఎప్‌స్టీన్ ఎవరు?
అసలు ఎప్‌స్టీన్ ఎవరు? ఆయన పేరు చెబితే ఎందుకు హడలిపోతున్నారు అన్నది ఆసక్తిగా ఉంది. ఎప్‌స్టీన్ ఒక వివాదాస్పద బిజినెస్ మేన్. అమెరికా, బ్రిటన్‌లో హైప్రొఫైల్ వ్యక్తుల దగ్గరకు యువతులను పంపిన చరిత్ర ఆయనది. అలాగే, మైనర్లను వ్యభిచార కూపంలోకి దింపిన వ్యక్తి. ఈ ఆరోపణలు రుజువయ్యాయి. ఆయన జైలుశిక్ష ఎదుర్కొన్నారు. 2019లో ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి దారుణ చరిత్ర ఉన్న ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మస్క్ చేస్తున్న కొత్త ఆరోపణ.
బిల్లుతో కొత్త వివాదం:
“వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్”తో కొత్త వివాదం మొదలైంది. టాక్స్‌లు తగ్గిస్తూ ప్రభుత్వ ఖర్చును పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఈ బిల్లును వ్యతిరేకించారు ఎలాన్ మస్క్. మస్క్ తీరును తప్పుబట్టారు ట్రంప్. తన వల్లే ట్రంప్ గెలిచారని మస్క్ అన్నారు. మస్క్ వాదనను కొట్టిపారేశారు ట్రంప్. ఎలాన్ మస్క్ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు రద్దుచేస్తామని ట్రంప్ హెచ్చరించారు. నాసా చేపడుతున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నుంచి తన కంపెనీ స్పేస్ ఎక్స్ వైదొలుగుతుందని మస్క్ వార్నింగ్ ఇచ్చారు. మస్క్-ట్రంప్ గొడవతో టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి టెస్లా షేర్లు .
నువ్వెంత అంటే నువ్వెంత:
ట్రంప్, మస్క్ ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. ట్రంప్ మీద వచ్చిన లైంగిక ఆరోపణలు కొత్త కాదుకానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉండటం, ఆ వివరాలు తొక్కిపెట్టారని మస్క్ చెప్పడం షాకింగ్‌గా మారింది. ట్రంప్‌ను అభిశంసించాలన్న డిమాండ్‌ని మస్క్ ఎత్తుకోవడం అమెరికాలో సంచలనంగా మారింది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు ప్రయత్నించినా, వర్కవుట్ కాలేదని అంటున్నారు. ఇప్పుడు ట్రంప్, మస్క్ యుద్ధంలో ఏయే అంశాలు బయటకు వస్తాయి? ఇంకెన్ని డార్క్ సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి అన్నది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు దిమ్మదిరిగే షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధర
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి