Dhruva: ధృవ సినిమాలో విలన్ రోల్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఆయన చేసుంటే అదిరిపోయేది

Dhruva: ధృవ సినిమాలో విలన్ రోల్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఆయన చేసుంటే అదిరిపోయేది


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ధ్రువ సినిమా ఒకటి. టాలీవుడ్ లో స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కిన తని ఒరువన్ సినిమా రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఇక ధ్రువ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీలో విలన్ గా ప్రముఖ నటుడు అరవింద్ స్వామి నటించిన విషయం తెలిసిందే. అరవింద్ స్వామి హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు ఇక ఈ సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.

అయితే ఈ సినిమాలో ముందుగా విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని కాకుండా మరో నటుడిని అనుకున్నారట. ధ్రువ సినిమా మిస్ చేసుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా..? ఆయనే కింగ్ నాగార్జున. సురేందర్ రెడ్డి ముందుగా విలన్ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట.

అయితే కథ విన్న తర్వాత ఓకే కూడా చెప్పారట.. కానీ ఆతర్వాత అనుకోని కారణాల వల్ల నో చెప్పారని తెలుస్తుంది. అయితే హీరోగా బిజీగా ఉన్న నాగ్  డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో ధ్రువ సినిమాకు నో చెప్పాడట నాగ్.. అలాగే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను కూడా సంప్రదించారట. కానీ కన్నడలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన నెగిటివ్ పాత్రలో నటించని చెప్పారట. దాంతో తమిళ్ లో నటించిన అరవింద్ స్వామినే తీసుకున్నారట. ఇక ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కింగ్ నాగార్జున వరుసగా సినిమాలు చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రజినీకాంత్ కూలీ సినిమాలోనూ నటిస్తున్నారు నాగ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *