అసలు ఏం జరిగిందంటే మే 26వ తేదీ రాత్రి 10 గంటలకు భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది. ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాంశ్ గురించి ఆరాతీశారు. అయితే ఆ పిల్లవాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో రిషిరాజ్ హుటాహుటిన దేవాంశ్ గురించి వెతకడం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో జనరేటర్ పనిచేయకపోవడాన్ని గమనించారు. దేవాంశ్ దేవాంశ్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించారు. అయితే పప్పా పప్పా అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది. లిఫ్ట్లో కుమారుడు ఇరుక్కుపోయాడని గ్రహించిన తండ్రి తన పిల్లవాడికి ధైర్యం చెబుతూ మెట్లు ఎక్కుతూ దిగుతూ జనరేటర్ ఉన్న ప్రాంతానికి పరుగుతీశారు. అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ కావడం ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి. ఆ చీకటిలో రిషిరాజ్ గుండెపోటుతో కుప్పకూలిపోవడాన్ని ఎవరూ గమనించలేదు. కాస్త ఆలస్యంగా చూసి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
మరిన్ని వీడియోల కోసం :