పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విక్రమ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. డైరెక్టర్ ఆత్మకు శాంతి కలగాలని, ఈ కఠిన సమయంలో విక్రమ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించాలంటూ ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక విక్రమ్ సుకుమారన్ తమిళ సినిమా చరిత్రలోని ప్రముఖ దర్శకులలో ఒకరు. ఆయన ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అంతేకాకుండా ‘ఆడుకలం’ సినిమాకు గానూ దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత, ‘మధాయనై కూట్టం’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు విక్రమ్ సుకుమారన్ . ప్రముఖ నటుడు భాగ్యరాజ్ కుమారుడు శంతనుతో కలిసి రావణ కొట్టం మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కేవలం డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు విక్రమ్. అయితే జూన్ 01న తన నెక్ట్స్ మూవీ స్టోరీని చెప్పేందుకు మధురై వెళ్లాడు ఈయన.ఈ క్రమంలోనే చెన్నై వచ్చేందుకు బస్సు ఎక్కారు. కానీ.. అలా ఎక్కుతుండగానే గుండెపోటు రావడంతో… కుప్పకూలిపోయాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దోష పరిహారమా ?? కామాఖ్య ఆలయంలో ఆషు రెడ్డితో.. పూజలు చేయించిన వేణుస్వామి
గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ !!
విజయశాంతి ఎవరో కాదు.. రియల్ లైఫ్లో బాలయ్యకు కోడలు అవుతుంది
దిలావర్ సింగ్ భార్యను.. నేను కాదు మొర్రో అంటే వినరే..!
మహేష్ కోసం పోటీపడుతున్న.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్