అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా మొత్తం 73 అవార్డులను తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు గానూ, ఒక్కో చిత్రానికి 10 లక్షల రూపాయలు, రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి 7 లక్షల రూపాయలు, మూడో ఉత్తమ చిత్రాలకు, ఒక్కో చిత్రానికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించనున్నారు. అంతేకాదు మొత్తం సుమారు రూ. 25 కోట్లతో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన తర్వాత అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు నిర్వాహకులు. సుమారు 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందించనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపికను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్! ఆగం ఆగం చేస్తున్నారుగా
ఓటీటీలు గట్రా లేవ్.. నా సినిమాను నేరుగా యాట్యూబ్‌లో వేస్తా
నల్లని ఒత్తయిన జుట్టు కోసం.. ఇదొక్కటి చాలు
పొలానికి వెళ్లిన అతని ఫేట్ తిరిగిపోయింది.. ఒక్కరాయి జీవితాన్నే మార్చేసింది
ఈ పండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదలరు!