బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పలు సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించి బుల్లితెరపై ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దేశంలోనే ఇప్పుడు ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టీవీ నటి. కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు. 18 ఏళ్లకే సహ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లకే తల్లైంది. కానీ కొన్నాళ్లకే తన భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న ఆమె మరో నటుడిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకే తన భర్త గృహహింసకు పాల్పడుతున్నాడంటూ కోర్టును ఆశ్రయించింది. చివరకు రెండో భర్తతోనూ డివోర్స్ తీసుకుని ఒంటరిగా జీవిస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అయినప్పటికీ ఈ బ్యూటీ అందంలో మాత్రం తగ్గలేదు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. సీరియల్ నటి శ్వేతా తివారి.
కసౌటీ జిందగీ కె.. హిందీ బుల్లితెర ప్రపంచంలో ఈ సీరియల్ సృష్టించిన రికార్డ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సంవత్సరాలపాటు బుల్లితెర సినీప్రియులను అలరించింది ఈ సీరియల్. ఇందులో ప్రేరణ శర్మ అనే ప్రధాన పాత్రలో సహజ నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత మరిన్ని సీరియల్స్ చేసి జనాలకు దగ్గరయ్యింది. కొన్నాళ్లకు బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 4లో పాల్గొని విన్నర్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఆ తర్వాత నెమ్మదిగా పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. కానీ సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ ద్వారానే పాపులర్ అయ్యింది.
శ్వేతా తివారీ.. 1998లో తన సహ నటుడుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు వీరికి పాలక్ తివారి జన్మించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. 2013లో అభినవ్ కోహ్లి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించాడు. ఇక రెండో భర్త తనను వేధిస్తున్నాడని 2019లో ఆమె కోర్టుకెక్కింది. దీంతో అదే ఏడాది వీరికి విడాకులు మంజారు చేసింది కోర్టు. ప్రస్తుతం ఒక్కో సీరియల్ కు అత్యధికంగా పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.81 కోట్లు.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..