Aamir Khan: నాకు 21, ఆమెకు 19.. మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణమేంటో చెప్పిన ఆమిర్ ఖాన్

Aamir Khan: నాకు 21, ఆమెకు 19.. మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణమేంటో చెప్పిన ఆమిర్ ఖాన్


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్న అతను తన ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మూడో వివాహం కూడా చేసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమిర్ ఖాన్ రీనా దత్తా , కిరణ్ రావులతో విడాకులు తీసుకున్నారు. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం బెంగళూరుకు చెందిన గౌరీ అనే మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఆమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటోన్న ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఆమిర్ ఖాన్, రీనా దత్తా 1986 లో వివాహం చేసుకున్నారు. వారు 2002 లో విడాకులు తీసుకున్నారు. వివాహం జరిగినప్పుడు ఇద్దరూ చిన్న వయస్సులోనే ఉన్నారు. ఇదే తమ కుటుంబంలో చీలికకు కారణమని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు.’రీనా, నేను చాలా త్వరగా పెళ్లి చేసుకున్నాము. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఆమె వయస్సు 19 సంవత్సరాలు. మేము ఒకరినొకరు 4 నెలలు మాత్రమే తెలుసు. మేము కలిసి ఎక్కువ సమయం గడపలేదు. మేము ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకున్నాం. కాబట్టి మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, వివాహం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపిస్తోంది. టీనేజ్ ఉత్సాహంలో, నేను చాలా విషయాలను అర్థం చేసుకోలేకపోయాను’

‘రీనాతో నా జీవితం చాలా బాగుంది. ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పలేదు. ఆమె చాలా మంచి వ్యక్తి. మేం కలిసి పెరిగాము. పరస్పర గౌరవం ఉంది. కానీ ఎవరూ తొందరపడి పెళ్లి చేసుకోకూడదు” అని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *