
ఉపవాసం ఉన్నప్పుడు శరీరం వెంటనే అందుబాటులో ఉన్న ఇంధనాన్ని వాడుకుంటుంది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే నేరుగా శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుందని కొందరు భావిస్తారు. కానీ నిజానికి శరీరానికి అవసరమైన శక్తిని అందించకపోతే.. శరీరం కండరాల ప్రోటీన్లను కూడా శక్తిగా వాడే ప్రమాదం ఉంది. దీని వల్ల కండరాలు బలహీనపడతాయి.
కండరాలు దెబ్బతినకుండా ఉండాలంటే వ్యాయామం ప్రారంభించే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇది శక్తిని అందించడమే కాదు.. శరీరం అలసట, తలనొప్పుల నుంచి తప్పించుకుంటుంది. కనీసం 40 నుంచి 45 నిమిషాల ముందు కొద్దిగా స్నాక్ తీసుకుంటే మంచిది.
ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయడం మంచిది కాదు. వీరు వ్యాయామం మొదలు పెట్టే ముందు తక్కువ మొత్తంలో అయినా శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఇది బీపీ, షుగర్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
తక్కువ క్యాలరీలతో శక్తినిచ్చే డ్రింక్ లు వ్యాయామానికి ముందు తీసుకోవచ్చు. ఉదాహరణకు బ్లాక్ కాఫీ లేదా కెఫిన్ ఉన్న ప్రీ వర్కవుట్ డ్రింక్స్. ఇవి అలసటను తగ్గించి.. శక్తిని పెంచుతాయి. అయితే ఇవి పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
ఆయాసం లేకుండా శక్తి పొందాలంటే చిన్న అరటిపండు, యాపిల్ లేదా పాలతో కలిపి తీసుకునే డ్రైఫ్రూట్స్ బాదం, అంజీరా చాలా మంచివి. ఇవి శక్తిని త్వరగా అందిస్తూ.. వ్యాయామాన్ని సజావుగా కొనసాగించడానికి సహాయపడతాయి.
కొంతమందికి ఉదయాన్నే ఏమీ తినాలనిపించదు. అటువంటప్పుడు తేలికపాటి గ్లూకోజ్ నీరు తాగడం ఒక మంచి ఎంపిక. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వర్కవుట్ మధ్యలో కూడా దీనిని తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే ముందు మీ శరీరానికి తగిన శక్తిని అందించడం చాలా ముఖ్యం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)