పిప్పళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి 5 గ్రా. తీసుకుని కలిపి చిన్న ఉండల్లా చేయాలి. వాటిని పూటకు ఒకటి చొప్పున మింగితే, దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. వాటిపై పిప్పళ్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1గ్రాము పిప్పళ్ల పొడికి అర టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే ఆయా సమస్యలు తగ్గుతాయ్.