
రాగి పాత్రల మీద పేరుకుపోయే మలినాలు పోవాలంటే నిమ్మరసం, ఉప్పు మంచి మిశ్రమం. ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి దాని పైన ఉప్పు చల్లండి. దానితో పాత్రలపై రుద్దండి. ఇలా రుద్దడం వల్ల మలినాలు పోతాయి. మరకలు మాయం అవుతాయి. నిమ్మరసం, ఉప్పుతో శుభ్రం చేసిన తర్వాత ఆ పాత్రలు పాత మెరుపును మళ్లీ పొందుతాయి. ఇవి మెరిసిపోతూ.. కొత్త పాత్రలలా కనిపిస్తాయి. దీనికి ప్రత్యేకమైన క్రీములు అవసరం లేదు. ఇది సహజంగానే సాధ్యం అవుతుంది.
రాగి పాత్రలకు పాత పొడి మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు వెనిగర్ చాలా ఉపయోగపడుతుంది. రెండు చెంచాల వెనిగర్ తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలపై రాయండి. కొన్ని నిమిషాలు ఉంచి తుడిచేయండి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.
ఇంకా మెరుగైన శుభ్రత కావాలంటే.. వెనిగర్, ఉప్పులో గోధుమ పిండి కలిపి ముద్దలా చేయండి. ఈ మిశ్రమాన్ని రాగి పాత్రల మీద వేసి గుండ్రంగా రుద్దుతూ శుభ్రం చేయండి. గోధుమ పిండి సహజమైన స్క్రబ్ లా పని చేస్తుంది.
పాత్రలపై మిశ్రమం రాసిన తర్వాత 15 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. వేడి నీరు మలినాలను తేలికగా తొలగించడంలో సహాయపడుతుంది. అది పాత్రలకు మెరుపు కూడా ఇస్తుంది.
మరొక పరిష్కారంగా బేకింగ్ సోడా తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు కలిపి రాగి పాత్రలపై రుద్దండి. ఇది లోతైన శుభ్రతకు ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా వాడటం వల్ల చర్మానికి హాని లేకుండా సహజంగా పాత్రలు మెరుస్తాయి.
రాగి పాత్రలు పూర్తిగా శుభ్రం కావాలంటే.. గోధుమ పిండి, సబ్బు పొడి, ఉప్పును సమంగా కలిపి మిశ్రమం చేయండి. స్పాంజ్ లేదా మెత్తని బ్రష్ తో రుద్దండి. ఇలా శుభ్రం చేస్తే పాత్రలు మెరిసిపోతూ, కొత్తవాటిలా కనిపిస్తాయి.
ఈ చిట్కాలు ఇంట్లోనే ఉండే పదార్థాలతో తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితం ఇస్తాయి. రాగి పాత్రలు శుభ్రంగా మెరుస్తూ ఉండాలంటే వారానికి ఒకసారి ఈ పద్ధతులను పాటించండి. అంతేకాకుండా ఇది వంటగదిలో ఆరోగ్యకరమైన శుభ్రతను కూడా అందిస్తుంది.