Tollywood: ఆర్థిక సమస్యలతో చదువు మానేసి.. సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యింది.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: ఆర్థిక సమస్యలతో చదువు మానేసి.. సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యింది.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..


సాధారణంగా అభిమానులు తమకు ఇష్టమైన చిన్ననాటి చిత్రాలను చూడటానికి ఇష్టపడతారు. పైన ఫోటోలో కనిపించే అమాయకమైన చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టా్ర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు..ఆమె భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇటీవల ఆమె నిర్మాతగా నిర్మించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమంత.

ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు. చిన్నప్పుడే ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడిన ఈ బ్యూటీ ఇప్పుడు రూ.120 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైన సామ్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. సమంతా రూత్ ప్రభు ఇటీవల ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే స్పై-థ్రిల్లర్ షోలో కనిపించింది. అలాగే నిర్మాతగా శుభం చిత్రాన్ని నిర్మించింది.

2010 తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’తో సమంత తన కెరీర్‌ను ప్రారంభించింది. చిన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉండడంతో చదువు మధ్యలోనే మానేసి సినిమాల్లోకి వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. ప్రస్తుతం సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగాఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *