శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. రక్తాన్ని ఫిల్టర్ చేయడంతో పాటు, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం లాంటి ముఖ్య విధులను మూత్రపిండాలు నిర్వహిస్తాయి.. మూత్రపిండంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ విధుల్లో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేక కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణం బాక్టీరియా. ఇది కాకుండా, కొన్ని వ్యాధుల వల్ల కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ రావచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..? దానిని నివారించడానికి ఏమి చేయాలి? సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వైభవ్ సక్సేనా ఏం చెప్పారు..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..
కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. వీటిలో బ్యాక్టీరియా, రాళ్ళు, నిర్జలీకరణం (డీహైడ్రేషన్) ప్రధానమైనవి. ఇది కాకుండా, కొన్ని వ్యాధులు, పరిస్థితుల కారణంగా కూడా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. మూత్రాన్ని ఎక్కువసేపు నిలుపుకోవడం వల్ల, కొన్నిసార్లు మూత్రం మూత్రాశయం నుంచి మూత్రపిండాలకు తిరిగి వెళుతుంది. దీనివల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు, మధుమేహం, గర్భం కారణంగా మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొన్ని ఆహారాలు – పానీయాలు కూడా మూత్రపిండాల ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి.
కిడ్నీ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఆహారాలు..
అనేక ఆహారాలు కిడ్నీ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. తెలిసి లేదా తెలియక మనం వాటిని వినియోగిస్తాము. అధిక ఉప్పు శాతం ఉన్న ఆహారాలతో పాటు, వీటిలో ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్, కెఫిన్, భాస్వరం అధికంగా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఎక్కువ నీరు త్రాగడం వల్ల లేదా చాలా తక్కువ నీరు త్రాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్ల నివారణకు ఏం చేయాలి..
మూత్రపిండాలను సురక్షితంగా ఉంచడానికి, పైన పేర్కొన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వైభవ్ సక్సేనా వివరించారు. అధిక ఉప్పు కలిగిన ఆహారాలు మూత్రపిండాలకు మరింత హాని కలిగిస్తాయి. దీనితో పాటు, మద్యం సేవించడం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా ప్రభావితమవుతుంది. మీరు రోజంతా తగినంత నీరు, 8 నుండి 10 గ్లాసులు త్రాగాలి. దీనివల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోండి.. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.