'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకొని వచ్చింది ఐఆర్సిటీసీ. ఇందులో ఊటీ, కూనూర్ కవర్ చేయవచ్చు, ఇది ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజు కొనసాగుతుంది. దీనిలో స్లీపర్, థర్డ్ ఏసీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
దీని ధరల విషయానికి వస్తే కంఫర్ట్ (3A)లో సింగిల్ షేరింగ్ రూ. 34260, ట్విన్ షేరింగ్ రూ. 19100, ట్రిపుల్ షేరింగ్ రూ. 17140, 5-11 సంవత్సరాలు పిల్లలకు మంచంతో రూ. 9500, మంచం లేకుండా రూ. 9190గా నిర్ణయించారు. అలాగే స్టాండర్డ్ (స్లీపర్) సింగిల్ షేరింగ్ రూ. 31800, ట్విన్ షేరింగ్ రూ. 16640, ట్రిపుల్ షేరింగ్ రూ. 14680, 5-11 సంవత్సరాలు పిల్లలకు మంచంతో రూ. 7050, మంచం లేకుండా రూ. 6740గా ఉన్నాయి.
1వ రోజు మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:20 గంటలకు రైలు నెం.17230, శబరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం మొదలవుతుంది రాత్రిపూట మొత్తం ఇందులోనే ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది.
తర్వాత 2వ రోజు బుధవారం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కు 07:57 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి వెళ్లి హోటల్లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు సందర్శించి ఊటీలో రాత్రిపూట బస చేస్తారు.
3వ రోజు గురువారం హోటల్లో అల్పాహారం ముగించుకొని దోడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతం సందర్శించి తరిగి ఊటీలో హోటల్కి చేరుకొని రాత్రిపూట బస చేస్తారు. 4వ రోజు శుక్రవారం హోటల్లో అల్పాహారం తర్వాత కూనూర్ సందర్శన స్థలాలను చూసి తిరిగి మధ్యాహ్నం ఊటీకి చేరుకొని. రాత్రిపూట అక్కడే బస చెయ్యంలి.
05వ రోజు శనివారం హోటల్లో అల్పాహారం చేసి మధ్యాహ్నం చెక్ అవుట్ చేసి కోయంబత్తూర్కు టౌన్ రైల్వే స్టేషన్కి వెళ్లి రైలు నంబర్ 17229, శబరి ఎక్స్ప్రెస్లో 15:55 గంటలకు తిరుగు ప్రయాణం అవుతురు. 06వ రోజు ఆదివారం 12:30 గంటలకు సికింద్రాబాద్ రావడంతో టూర్ ముగుస్తుంది.