గొంతులో స్వీట్ ఇరుక్కుపోయి చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందింది. అవును కేక్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఒక మహిళ మృతిచెందిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. కూతురి వివాహానికి ఒక్క రోజు ముందే.. ఇలాంటి విషదం జరిగింది. గత గురువారం ఆమె గొంతులో కేక్ ఇరుక్కుపోవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. తన ఏకైక కుమార్తె ఖైరున్నిసా వివాహం శనివారం (మే 31) జరగాల్సి ఉండగా తల్లి మరణంతో పెళ్లింట విషాద చాయలు అలుముకున్నాయి.
జైనబా కుమార్తె ఖైరున్నిసా వివాహం జరగనున్న శనివారం ఈ సంఘటన జరిగింది. తల్లి ప్రాణాపాయంలో ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో కుమార్తె నిఖా వేడుక మాత్రమే జరిపించారు. ఇతర వివాహ వేడుకలు వాయిదా వేశారు. తానలూరుకు చెందిన దివంగత నంబిపరంబిల్ కుంజిముహమ్మద్ హాజీ, ఉన్నిమా దంపతుల కుమార్తె జైనాబా. మృతురాలికి భర్త, ఒక కుమార్తె ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇలాంటిదే మరో సంఘటనలో అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రైలు ఢీకొని ఓ గృహిణి మరణించిన విషాద సంఘటన కూడా కేరళలో జరిగింది. కేరళ వడకరలోని చెరోడ్ ప్రాంతంలో రైల్వే వంతెన దాటుతుండగా వందే భారత్ రైలు వారిని ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకున్న వడకర పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..