తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కమలం పార్టీ చాలెంజ్‌గా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇవాళ హైదరాబాద్ వేదికగా జరగబోతోన్న తెలంగాణ బీజేపీ వర్క్‌షాప్ ఆసక్తి రేపుతోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో కీలక వర్క్‌షాప్ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు అభయ్‌పాటిల్, చంద్రశేఖర్ తివారీ హాజరుకానున్నారు. కేంద్రమంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు.. రాష్ట్ర పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా.. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మోదీ 3.0 ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జనంలో తీసుకువెళ్లడం, అంతర్జాతీయ యోగా డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వాహణపై ఫోకస్ చేస్తారు. పార్టీ భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై దృష్టి సారించనున్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ వేదికల్లో నేతలు మాట్లాడాల్సిన తీరుపై నేషనల్ లీడర్స్ సూచనలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైనా రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సమావేశానికి నేతలంతా ఖచ్చితంగా హాజరు కావాలని బీజేపీ తెలంగాణ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
మరోవైపు.. హైదరాబాద్ ఆఫీసులో కీలక సమావేశం వేళ.. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. తెలంగాణ బీజేపీ న్యూ చీఫ్ ఎవరనే అంశం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేసిన నేతలు.. అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ జరిగే కమలం పార్టీ వర్క్‌షాప్‌లో చర్చల తర్వాత టీ.బీజేపీ చీఫ్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్తున్నారు. అతి త్వరలోనే టీ.బీజేపీ నూతన అధ్యక్షుడ్ని ప్రకటించే చాన్స్ ఉందంటుందంటున్నారు.
ఈ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడి నియామకంపై అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే.. ఎవరో చెబితే హైకమాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను నియమించదని గుర్తు చేశారు. దీనికి సంబంధించి బీజేపీకి స్పష్టమైన విధానం ఉందని బండి సంజయ్ చెప్పారు.
మొత్తంగా.. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎంపిక వ్యవహారం చాలెంజ్‌గా మారింది. అధిష్టానం వైపు పలువురు కీలక నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ జరిగే టీ.బీజేపీ కీలక వర్క్‌షాప్‌లో క్లారిటీ వస్తుందా?.. లేదా?.. అన్నది చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..