మనం ఏదో ఒక రూపంలో పాలను వాడుతూనే ఉంటాం.. అలాంటి పాలలో ప్రోటీన్, విటమిన్ 12, కాల్షియం, పొటాషియం, భాస్వరం వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ప్రతి రోజూ గ్లాస్ పాలు తాగడం వల్ల శరీర ఎముకలను బలపరుస్తుంది. కానీ, నల్లటి పాలు చాలా పలుచగా ఉండి, కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అవును మీరు చదువుతున్నది నిజమే నలపు రంగులో ఉండే పాలను ఇచ్చే జంతువు కూడా ఉంది. కానీ, నల్లటి రంగులో ఉండే పాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి నల్లటి రంగు పాలిచ్చే జంతువు, నల్లటి పాల వినియోగంతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
నల్లటి రంగులో ఉండే పాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆఫ్రికాలోని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. ఆఫ్రికాలో ఉండే ఆడ ఖడ్గమృగం నుంచి ఈ నల్లటి పాలు సేకరిస్తారట. ఈ పాలు తాగడం వల్ల లాభాలు కలుగుతాయట. ఈ పాలలో కొవ్వు ఉండదని చెబుతున్నారు.. ఇవి ఆర్యోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఖడ్గమృగాల పాలు ప్రతిరోజు తాగడం వల్ల శరీరం శక్తివంతంగా దృఢంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారను. ఆఫ్రికాలోని చాలామంది ఈ ఇప్పటికీ ఈ పాలను తాగుతున్నారని కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు.
ఖడ్గమృగం పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఈ నల్లటి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఖడ్గమృగం పాలలో అధిక మొత్తంలో ఐరన్ ఉండటమే పాలు నల్లగా ఉండటానికి కారణం అంటున్నారు నిపుణులు. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.