మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సామం లభిస్తాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగ పడతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకా లంలో సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి.