మహీంద్రా థార్ రాక్స్ ఎస్‌యూవీ ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని పొందిన ప్రపంచంలోని తొలి ఎస్‌యూవీగా ఇది నిలిచింది. భారతదేశంలోని ప్రసిద్ధ SUVలలో ఒకటైన మహీంద్రా థార్ ROXX కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. దీని AX7L వేరియంట్ డాల్బీ అట్మాస్‌తో అప్‌డేట్ చేసింది కంపెనీ. దీనితో ఇది 4-ఛానల్ ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్‌తో డాల్బీ అట్మాస్‌ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి SUVగా నిలిచింది. ఇది వాహనదారుల ప్రయాణాన్ని గతంలో కంటే మెరుగ్గా చేస్తుంది. థార్ రాక్స్‌లో డాల్బీ ఆటమ్స్ జోడించిన తర్వాత డ్రైవింగ్ మునుపటి కంటే ఎలా మెరుగ్గా మారుతుంది.
ఈ ఎస్‌యూవీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంలో గానా యాప్ అనుసంధానం చేశారు. దీని ద్వారా ప్రయాణికులు సాంగ్స్‌ను వినే అవకాశం ఉంటుంది. ప్రీమియం 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టంతో నాలుగు ఛానెళ్ల లీనమయ్యే ఆడియో డాల్బీ అట్మాస్ సమకూర్చింది.
డాల్బీ అట్మాస్‌తో థార్ ROXX:
మహీంద్రా థార్ ROXX దాని బలమైన నిర్మాణం, ఆఫ్-రోడింగ్‌కు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఇది సంగీత ప్రియులకు కూడా మొదటి ఎంపిక కానుంది. డాల్బీ అట్మాస్‌ను జోడించిన తర్వాత కారులో సంగీత అనుభవం మీరు కచేరీ హాలులో కూర్చున్నట్లుగా ఉంటుంది. మీరు నగరంలో ఉన్నా లేదా అటవీ మార్గంలో ప్రయాణం చేస్తున్నా దీనిలో అందుబాటులో ఉన్న 9-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ మీ ప్రతి ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మారుస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పాటల స్ట్రీమింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే మీరు డాల్బీ అట్మాస్ అద్భుతమైన సౌండ్ క్వాలిటీలో ఎప్పుడైనా మీరు ఇష్టమైన పాటలను వినవచ్చు.
డాల్బీ అట్మాస్ ఫీచర్స్:
ఇది సంగీతం, సినిమాలు, గేమింగ్‌లకు పూర్తిగా కొత్త అనుభవాన్ని అందించే టెక్నాలజీ. ఇందులో ఏదైనా వింటే మీరు ఆ వాతావరణంలో ఒక భాగమైనట్లు అనిపిస్తుంది. డాల్బీ అట్మాస్ మీ చుట్టూ ఉన్న ప్రతి బీట్‌ను తీసుకురావడం ద్వారా లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
దీనికి సంబంధించి మహీంద్రా ఆటో, డాల్బీ అట్మోస్ మధ్య భాగస్వామ్యం ఉంది. దీని గురించి డాల్బీ లాబొరేటరీస్ సీనియర్ డైరెక్టర్ (IMEA) కరణ్ గ్రోవర్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం పట్ల తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని అన్నారు. థార్ ROXX AX7Lలోని డాల్బీ అట్మోస్‌తో తాము డ్రైవింగ్ ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాము. ఈ వాహనం మీ క్యాబిన్‌ను వ్యక్తిగతీకరించిన కచేరీ హాల్‌గా మారుస్తుంది. థార్ ROXX సాహసోపేత స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మహీంద్రా, డాల్బీ కలిసి ప్రపంచ భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చే ఇన్-క్యాబిన్ టెక్నాలజీలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి