Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం


సినిమా హీరోలు, క్రికెటర్లు తమ ఆదాయం కోసం వాణిజ్య ప్రకటనల్లో నటిస్తుంటారు. అందులో తప్పేమీ లేదు. అయితే సెలబ్రిటీలన్నాక కూసింత సామాజిక బాధ్యత కూడా ఉండాలంటారు. ఎందుకంటే వీరిని ఎంతో మంది గమనిస్తుంటారు. కొంత మందైతే తమ అభిమాన హీరోలు, క్రికెటర్లనే అనుసరిస్తుంటారు. వారేం చేస్తే అభిమానులు కూడా అదే చేస్తుంటారు. అందుకే బ్రాండ్ల ప్రమోషన్ విషయంలో సెలబ్రిటీలు కాసింత జాగ్రత్తగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, పాన్ మసాలాలు, గుట్కాలు, ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్స్ విషయంలో సెలబ్రిటీలు బాగా ఆలోచించాలంటున్నారు. ఆ మధ్యన బాలీవుడ్ లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. పాన్ మసాలా యాడ్స్ లో నటించినందుకు స్టార్ హీరోలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అమితాబ్ లాంటి దిగ్గజ నటులు వీటి నుంచి వెనక్కు తగ్గారు. తాజాగా ఓ ఆల్కహాల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్.

ప్రభాస్ ఆదిపురుష్ లో సీతమ్మగా నటించిన కృతిసనన్ ఇప్పుడు మ్యాజిక్‌ మూమెంట్స్‌ వోడ్కాకు కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. అంటే ఇప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ మ్యాజిక్ మూమెంట్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్నమాట. ‘ కృతిని మా జట్టులోకి తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేం లక్ష్యంగా చేసుకున్న కొత్త తరం యువ వినియోగదారులలో కెల్లా ఆమె తెలివైనది, స్టైలిష్‌ గా ఉంటుంది. ఇది తమ మ్యాజిక్‌ మూమెంట్స్‌కు కొత్త అధ్యాయం’ అని బ్రాండ్ ప్రతినిధులు కృతి సనన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మ్యాజిక్ మూమెంట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కృతి సనన్

ఇక కృతి సనన్ కూడా ‘మ్యాజిక్‌ మూమెంట్స్‌ అంటే మంచి అనుభూతిని సొంతం చేసుకోవడం. ఈ మ్యాజిక్‌ కుటుంబంలో చేరడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుంది’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. దీంతో నెటిజన్లు కృతి సనన్ పై మండిపడుతున్నారు. సీత పాత్రను చేసి ఇప్పుడిలా ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోటో చేయడం తగదంటూ ట్రోల్ చేస్తున్నారు.

బ్రాండ్ ప్రమోషన్లలో బిజి బిజీగా కృతి సనన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *