బాలకృష్ణ ఇంటి వద్ద డివైడర్ డీకొట్టడమే కాకుండా పెద్ద స్కెచ్.. సినిమా సీన్‌ను మించి..!

బాలకృష్ణ ఇంటి వద్ద డివైడర్ డీకొట్టడమే కాకుండా పెద్ద స్కెచ్.. సినిమా సీన్‌ను మించి..!


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మద్యం మత్తులో కారు నడిపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శిరీష్, ప్రమాదం జరిగిన తర్వాత కారు వదిలి పారిపోయాడు. అతడు తన స్థానంలో వేరే వ్యక్తిని పంపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలు నిందితుడిని గుర్తించిన పోలీసులు, శిరీష్‌తోపాటు అతడి స్థానంలో వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రెండు రోజుల క్రితం బాలకృష్ణ ఇంటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన గురించి తెలిసిందే. గత ఆదివారం(మే 26) ఉదయం మద్యం సేవించి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి వస్తున్న క్రమంలో సిగ్నల్ పక్కనే ఉన్న బాలకృష్ణ ఇంటి వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటారని భయపడి ఆ కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత అతని స్థానంలో మరో వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీసుల ముందు వచ్చి, ఆ కారణం నడిపింది తానేనని ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు.

అయితే అప్పటికే పోలీసులు సంబంధిత సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అసలు నిందితుడిని గుర్తించారు. ఆ కారును వదిలి వెళ్ళిపోతున్న దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే నిందితుడిని గుర్తించారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి, కారు నడిపిన వ్యక్తి ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఒరిజినల్‌గా కారు నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు నిందితుడు దొరికాడు. తానే కావాలని తన బదులు మరో వ్యక్తిని పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *