Pawan Kalyan: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య..?

Pawan Kalyan: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య..?


ఎన్నికల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ప్రస్తుతం ‘హరి హర్ వీర్ మల్లు’, ‘ఓజీ’ , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అయితే ఎన్నికల తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా బిజీగా మారిపోవడంతో ఈ మూడు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. అయితే ఎన్నో పని ఒత్తిడుల మధ్య ఇటీవలే ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు పవన్ కల్యాణ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాత సుజిత్ ఓజీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. ఇప్పటికే దీనిపై ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీని ప్రకారం ‘ఓజీ’ సినిమా షూటింగ్ కి ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

ఓజీ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా కట్టుకున్నాయి. ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రియ రెడ్డి కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ ఓజీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో భార్యకూడా నటిస్తుందని తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి

నారా రోహిత్ భార్య శిరీష లెల్ల ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వార్త చక్కర్లు కొడుతుంది. ఆమె విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి నటనపై మక్కువతో ఇండియాకు తిరిగొచ్చేసింది. ఇక మోడలింగ్ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగింది. అలా ఆమె నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2లో అవకాశం అందుకుంది. ఈ సినిమా సమయంలోనే రోహిత్, శిరీష ప్రేమలో పడ్డారు. గత ఏడాది అక్టోబర్ లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. కాగా రోహిత్ త్వరలోనే భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఇప్పుడు ఆయనకు కాబోయే భార్య పవన్ కళ్యాణ్ ఓజీలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *