యంగ్ హీరో శ్రీ విష్ణు ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది. అతను నటించిన తాజా సినిమా సింగిల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా సింగిల్ మూవీ నిలిచింది. డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలోతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సింగిల్ సినిమాను నిర్మించారు. వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ శ్రీను, సత్య, రెబా మోనికా జాన్, మానస చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూర్చారు. మే 09న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీవిష్ణు, కేతిక, ఇవానా మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సింగిల్ సినిమాకు భారీ వసూళ్లు రాబట్టాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సింగిల్ సినిమా రూ. 25 కోట్ల కు పైగానే కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమాతో కెరీర్ పరంగా మరో మెట్టు పైకెక్కాడు శ్రీ విష్ణు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాని మన టాలీవుడ్ లో ఒక హీరో మిస్ చేసుకున్నాడట.
ఇవి కూడా చదవండి
అవును.. సింగిల్ సినిమాలో హీరోగా మొదట శ్రీ విష్ణును అనుకోలేదట డైరెక్టర్ కార్తీక్ రాజు. అతను ఈ సినిమా కథను యూత్ స్టార్ నితిన్ కు వినిపించాడట. కథ విని చాలా బాగుందన్న నితిన్.. ఇప్పుడు తాను కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను, అవి పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని అన్నాడట. డైరెక్టర్ కూడా అందుకు అంగీకరించి ఏడాది వరకు ఎదురు చూశాడట. అయితే నితిన్ నుంచి ఎలాంటి కాల్ రాలేదట. దీంతో ఈ కథ ను బన్నీ వాసు కి వినిపించాడు. ఆయన వెంటనే అల్లు అరవింద్ తో మాట్లాడి ఈ స్టోరీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించేందుకు అగ్రీమెంట్ చేసుకుంటున్నాడట. ఆ తర్వాత హీరోగా శ్రీ విష్ణు లైన్ లోకి వచ్చాడట. అలా మొత్తానికి సింగిల్ సినిమా పట్టాలెక్కిందట. ఒక వేళ నితిన్ సింగిల్ సినిమాను చేసి ఉంటే బాగుండేదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
It’s a Blockbuster Sunday at the Box-office for #Single 💥
Theatres are echoing with fun & laughter 🤩 And Crowds are loving every moment of #SingleMovie 🤗🔥
🎟️ https://t.co/0LPVc1bviF @sreevishnuoffl @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @caarthickraju #VidyaKoppineedi… pic.twitter.com/PpiddHBJjr
— Geetha Arts (@GeethaArts) May 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.