AP TET 2024 Exam: టెట్ 2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. చివరి నిమిషంలో ఈ తప్పులు చేయండి

AP TET 2024 Exam: టెట్ 2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. చివరి నిమిషంలో ఈ తప్పులు చేయండి


అమరావతి, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు సమీపించాయి. దాదాపు మూడు నెలల ప్రిపరేషన్‌ తర్వాత ఎట్టకేలకు పరీక్ష తేదీలు సమీపించాయి. అక్టోబర్‌ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అంటే ఒక్కో సెషన్‌ పరీక్ష 2.30 గంటల వరకు జరుగుతుంది. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

ఇందుకోసం అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం టీసీఎస్‌కు అప్పగించింది. పరీక్ష సమయంలో విద్యుత్తు అంతరాయం, కంప్యూటర్లు మొరాయించడం వంటి అంతరాయాల్లేని చోట ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా తమతోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లవల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ హాల్‌టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరుకావల్సి ఉంటుంది. హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్‌ అధికారికి ఆధారాలు చూపించి, వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు.

కాగా ఈ సారి మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్‌కు భారీగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు 108 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 95 కేంద్రాలు, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంల్లో మరో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో 24,396 మంది పరీక్షలు రాస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి వీలవుతుంది. అలాగే డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఏపీ టెట్ 2024 జులై హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *