Rajinikanth: సూపర్ స్టార్ ఆరోగ్యం పై ప్రధాని ఆరా.. రజినీకాంత్ సతీమణికి మోడీ ఫోన్

Rajinikanth: సూపర్ స్టార్ ఆరోగ్యం పై ప్రధాని ఆరా.. రజినీకాంత్ సతీమణికి మోడీ ఫోన్


సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి  దేశ  సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు చూసి అభిమానులు ఆందోళన పడుతున్నారు. కాగా రజనీకాంత్‌ చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రిలో చేరారు. రక్తనాళాల వాపు వచ్చిందని, దాన్ని సరిచేయడానికి స్టెంట్‌ వేశామని, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే రజనీ తీవ్ర కడుపుతో బాధపడుతున్నారని. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 30న అపోలో ఆసుపత్రిలో చేరారు రజనీకాంత్.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

రజినీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. నాన్-సర్జికల్ ట్రాన్స్‌కాథెటర్ పద్ధతితో చికిత్స చేశారు. అలాగే స్టెంట్ కూడా వేశారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అలాగే రెండు రోజుల తర్వాత రజనీకాంత్ డిశ్చార్జ్ అవుతారని కూడా తెలిపారు. దాంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వాబ్ పెరుందగై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో పాటు పలు ఇతర పార్టీలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రజనీకాంత్ ఆరోగ్యం పై ఆరా తీశారని తెలుస్తోంది. రజనీకాంత్‌ సతీమణితో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’అని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *