England Cricket Board: ఐపీఎల్ ఆ మజాకా? ఏ దేశమైన రూల్స్ మార్చుకోవాలి..!

England Cricket Board: ఐపీఎల్ ఆ మజాకా?  ఏ దేశమైన రూల్స్ మార్చుకోవాలి..!


ఈసీబీ ( ఇంగ్లాంగ్ క్రికెట్ బోర్డు) ఇంటర్నేషనల్‌లో జరిగే లీగ్‌లకు తమ టీమ్ ప్లేయర్లను ఆడకుండా పరిమితులు పెట్టబోతున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ ప్లేయర్‌లు తమ లీగ్ మ్యాచ్‌ల కోసం డొమెస్టిక్ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తారని ఈసీబీ ఆందోళన చెందుతుంది. అందుకే సమ్మర్‌లో జరిగే డామాస్టిక్ క్రికెట్‌ కోసం ప్రపంచవాప్తంగా జరుగున్న లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వవద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

వచ్చే సంవత్సరం పలు దేశాలతో దొమెస్టక్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలవడం కోసం ఇప్పటి నుంచే ఇంగ్లాండ్ బోర్డు ప్రణళికలు రచిస్తుంది. దీంతో తమ ప్లేయర్స్‌కు ప్రీమియర్ లీగ్‌‌  ఆడేందుకు పరిమితులు పెట్టాలనే యోచనలో ఈసీబీ ఉన్నట్లు తెలుస్తుంది.

మరి ఐపీఎల్‌ పరిస్థితి ఏంటి?

ఐపీఎల్‌కు విషయంలో మాత్రం ఇంగ్లాండ్ తమ ప్లేయర్లకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఒక్క ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని బోర్డు సభ్యులు చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ప్లేయర్స్ డొమెస్టిక్ మ్యాచుల కంటే లీగ్‌ మ్యాచ్‌లలో ఆడటానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంగ్లాండ్ బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎంత నిజయం ఉందో తెలియాలంటే అధికారికి ప్రకటన వచ్చే దాకా వేచి చూడల్సి ఉంది.

ఇటీవలే బీసీసీఐ ఐపీఎల్ 2025 వేలానికి రూల్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్రాంఛైజీలు ఆర్‌.టీ.ఎమ్, రిటెన్షన్స్ ప్రకారం ఆరుగురు ప్లేయర్స్ తీసుకోవచ్చని తెలిపింది. ఐపీఎల్‌లో మొత్తం పది టీమ్‌లు ఉన్నాయి. దీంతో టిమ్‌లో ఏ ప్లేయర్‌ను ఉంచుకోవాలని ఫ్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నెల 31 లోపు అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్లు చెప్పాలని బీసీసీఐ డెడ్ లైన్ విధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *