ఈ తాబేళ్లు శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిల మీదుగా ఆంధ్రకు చేరిందని చెప్పారు. నాలుగేళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్ చేసిన మరో తాబేలు 3500 కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాకినాడ బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాబేళ్ల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ని పవన్ ఆదేశించారు. అయితే భాపట్ల జిల్లా సూర్యలంకలో సైతం ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతివాత పడ్డాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే సమయంలో వలలు, వేటపడవలు తగలడం, కాలుష్యం కారణంగా చనిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే వీటి జీవన విధానం, పునరుత్పత్తిపై పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం :